Jana Sena Praja Sankalpa Yatra:ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కేడర్ లో ర్యాలీ ఉత్సాహం నింపింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ ఎంఎల్ఏ అభ్యర్ధులు వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ గాంధీ క్షేత్రం వరకు తలపెట్టిన సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది.
30 కిలోమీటర్ల మేర కొనసాగిన ర్యాలీ: శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో అభ్యర్థులు పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. కొడాలి, చల్లపల్లి, మోపిదేవి మీదుగా అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. అభ్యర్థులకు అడుగడుగునా గజమాలలు, మంగళహారతులతో గ్రామ గ్రామాన ప్రజలు ఘనస్వాగతం పలికారు. గత కొన్ని రోజుల ముందు వరకు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం ఆలస్యం అవడం, రోజుకి ఒక పేరు వినపడటంతో జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగింది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండలి బుద్ధప్రసాద్‌కు జనసేన టిక్కెట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో ఒకటి రెండు రోజులు స్థానిక జనసేన నాయకులు వ్యతిరేకించారు. అయితే, జనసేన పార్టీ కేడర్‌ను మండలి కొద్ది రోజుల్లోనే ఒకే తాటి పైకి తెచ్చారు.