How to Reuse Makeup Items: ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు నలుగురిలో స్పెషల్‌గా కనిపించాలని మేకప్ లేకుండా బయటకు రావడం లేదు. ఈ క్రమంలో రోజూ మేకప్ చేసుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వేల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే, కొన్ని మేకప్ ఐటమ్స్ వాడకుండా ఉంటే విరిగిపోవడం, పొడారడం మనం గమనిస్తుంటాం. ఇలాంటప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కొన్న వాటిని బయట పడేయడానికి మనసు ఒప్పదు! అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల వీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
లిప్‌స్టిక్ : కొన్నిసార్లు లిప్‌స్టిక్ తేమ కోల్పోయి గట్టిగా అవుతుంది. అలాగే రంగు కూడా మారిపోతుంది. ఇలాంటప్పుడు లిప్‌స్టిక్‌ని ఓ రెండు నిమిషాలు వేడినీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల అది మృదువుగా మారడమే కాదు మంచి ఛాయలోనూ కనిపిస్తుంది. విరిగిపోయిన లిప్‌స్టిక్ అతుక్కోవాలంటే దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఆపై మీరు మళ్లీ కొత్తగా వాడుకోవచ్చు. లేకపోతే దానికి కొద్దిగా పెట్రోలియం జెల్ చేర్చి మరోసారి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడిచేయండి. అనంతరం దానిని రోలర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల లిప్‌స్టిక్ చక్కగా ఉపయోగించుకోవచ్చు.
కాంపాక్ట్ పౌడర్ : సాధారణంగానే సగం వాడాక కాంపాక్ట్ పౌడర్ పొడిబారి విడిపోతుంది. ఇలాంటప్పుడు కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్‌ని జతచేసి ఆ బాక్స్‌లో సర్దితే సరి. ఆపై కాంపాక్ట్ పౌడర్ చక్కగా కొత్తదానిలా కనిపిస్తుంది.
ఐలైనర్- మస్కారా: వాతావరణ మార్పులు, తరచూ మస్కారా ఓపెన్ చేయడం వంటి కారణాల వల్ల అది ఎండిపోతుంది. అయితే, ఇలాంటప్పుడు కొన్ని చుక్కల బాదం నూనెను వేసి బాగా కలపండి. ఓ రెండు గంటల తర్వాత వాడుకుంటే మస్కారా ఉపయోగిస్తే చక్కగా వస్తుంది.
నెయిల్‌పాలిష్ : ఎక్కువ మంది అమ్మాయిలు, మహిళలకు గోళ్లకు రంగు వేసుకోవడం చాలా ఇష్టం. మేకప్ కిట్‌లో ఎన్ని రకాల నెయిల్‌పాలిష్ ఉన్నా మళ్లీ కొత్తవి కొనుగోలు చేస్తుంటారు. అయితే, సరిగ్గా ఏదైనా పెళ్లి, ఫంక్షన్‌కు వెళ్లాలని నెయిల్‌పాలిష్ ఓపెన్ చేస్తే అది ఎండిపోయి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచక చాలా మంది బాధపడతారు. అయితే, ఒక చిన్న చిట్కా పాటిస్తే నెయిల్‌పాలిష్ కొత్తదానిలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండిపోయిన నెయిల్‌పాలిష్ సీసాలో మూడు నాలుగు చుక్కలు నెయిల్‌పాలిష్ రిమూవర్‌ని కలపండి. కొన్ని నిమిషాల తర్వాత మూత తీసి నెయిల్‌పాలిష్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ మేకప్ కిట్‌లోని ప్రతీ ఐటమ్ ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
మీకు తెలుసా? - చక్కెరను టీ/ కాఫీల్లోనే కాదు - ఇలా కూడా ఉపయోగించవచ్చు!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి - రెండు ఖండాలు, 14దేశాల మీదుగా ప్రయాణం