ETV Bharat / state

రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి - VIJAYASAI REDDY RESIGNS FROM MP

రాజ్యసభ ఛైర్మన్‌కు రాజీనామా లేఖ సమర్పించిన విజయసాయిరెడ్డి - జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేత

VijayaSai Reddy Resigns from MP
VijayaSai Reddy Resigns from MP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 12:19 PM IST

Updated : Jan 25, 2025, 2:13 PM IST

VijayaSai Reddy Resigns from MP : రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. దీనిని రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదించారని తెలిపారు. ఇక రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Vijaya Sai Reddy on Resignation : తన లాంటి వాళ్లు వెయ్యిమంది పార్టీని వీడినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదని విజయసాయిరెడ్డి అన్నారు. లండన్‌లో ఉన్న జగన్‌తో ఫోన్​లో మాట్లాడి అన్ని వివరించానని ఆ తర్వాతే తాను రాజీనామా పత్రం సమర్పించినట్లు చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక రాజకీయాలపై మాట్లాడటం తగదని పేర్కొన్నారు. ఇక ప్రాథమిక సభ్యత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలిసి ఏరోజూ అసత్యాలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.

హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. ఎవరైనా నేను అసత్యాలు చెప్పానంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి నుంచి జగన్‌ వరకు మూడు తరాలుగా నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ జీవితకాలంలో ఏ రోజూ ఆ కుటుంబంతో విభేదాలు రావు. పాత కేసుల విషయానికొస్తే 2011 ఆగస్టు 10న ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఎన్నో ఆశలు చూపించి తనను అప్రూవర్‌గా మారాలని ఎంతో ఒత్తిడి చేశారు. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మకద్రోహం అనేది ఉండదు. ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా అప్రూవర్‌గా మారేందుకు నిరాకరించా. - విజయసాయిరెడ్డి

'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ సీపోర్ట్స్‌ కేసు పెట్టారు. నాకు లుకౌట్‌ నోటీసు ఇచ్చారు ఏ-2గా చేర్చారు. ఇంతవరకు నన్ను సీఐడీ వాళ్లు పిలవలేదు. వ్యాపార లావాదేవీలు లేవని చెప్పా. నాపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పా. కేవీ రావు చెప్పేది నిజమైతే ఆయన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పమనండి. నేను నిజంగా విక్రాంత్‌రెడ్డిని ఆయన వద్దకు పంపించానన్న విషయంపై ప్రమాణం చేయమనండి. నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఏరోజు నాకు ఎవరూ చెప్పలేదు. కేసు పెట్టిన తర్వాతే నాకు కూడా విషయాలన్నీ తెలిశాయని' విజయసాయిరెడ్డి వివరించారు.

"విక్రాంత్‌రెడ్డితో నాకు పరిచయం చాలా తక్కువ. ఎక్కడైనా కనపడితే పలకరించేవాణ్ని అంతే. విక్రాంత్‌రెడ్డికి నాకన్న ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి కేవీ రావు. నాకు ఏ వ్యాపారాలు లేవు. దేంట్లోనూ భాగస్వామిగా లేను. నేను పూర్తిగా పార్టీకోసమే పనిచేశా.కొన్ని పత్రికలు, ఛానళ్లలో కాకినాడ సీపోర్టు విషయంలోనే రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్నారు." - విజయసాయిరెడ్డి

'మా వియ్యంకుడు నా క్లాస్‌మేట్‌ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్లారు. నేను చార్టెడ్‌ అకౌంట్‌గా వెళ్లా. మళ్లీ నేను నా కుమార్తె వివాహం అయ్యాకే ఆయనతో కలిశా. ఆయన వ్యాపార లావాదేవీలు నాతో ఏరోజూ చర్చించరు. నా వియ్యంకుడి వ్యాపారాల గురించి నాకు ఏమాత్రం తెలియదు. దయచేసి వార్తలు వార్తలుగానే ఇవ్వండి. అసత్య ప్రచారాలు చేయవద్దు. కేసుల మాఫీ కోసమే నేను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారని' విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం: విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. విజయసాయిరెడ్డి రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయినట్లు బులిటెన్ విడుదల చేశారు.

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ విజయసాయిరెడ్డి!

విజయసాయిరెడ్డి గుప్పిట్లో సాగరతీరం - అరాచకాలు, అక్రమాలతో అలజడి

Last Updated : Jan 25, 2025, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.