ETV Bharat / state

ఎమ్మెల్యేపై నసీర్ అహ్మద్‌పై దాడి- నలుగురు అరెస్టు - MLA NASEER AHMED ATTACK CASE

ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై ఇటీవల దాడికి యత్నించిన నలుగురు యువకులు- అరెస్టు చేసిన పోలీసులు

four_arrested_on_guntur_mla_naseer_ahmed_attack_attempt_case
four_arrested_on_guntur_mla_naseer_ahmed_attack_attempt_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 12:36 PM IST

Four Arrested On Guntur MLA Naseer Ahmed Attack Attempt Case : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై ఇటీవల దాడికి యత్నించిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆర్టీసీ కాలనీలో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఫిరోజ్, ఇంతియాజ్, యాసిన్, రోషన్, మున్నాలతోపాటు మరికొందరు యువకులు దాడి చేశారు. తమకు చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ నిర్వాహకురాలు మొవ్వా శైలజను అసభ్య పదజాలంతో దూషించారు.

దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యేపై ఫిరోజ్ కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే నసీర్ గన్‌మెన్ చేసిన ఫిర్యాదుతో పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని పట్టుకొనేందుకుమూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో ఫిరోజ్, ఇంతియాజ్, రోషన్, గుంటూరులో మున్నాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై దాడితో పాత గుంటూరులో పలుచోట్ల పికెట్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాంచాలి ఎంపీటీసీపై హత్యాయత్నం - అసలేమైంది ?

ప్రోటోకాల్​పై వైసీపీ,సమస్యలపై టీడీపీ- రసాబాసగా GMC COUNCIL MEETING - Clash Between YCP TDP Corporators

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.