ETV Bharat / state

అచ్యుతాపురం కేంద్రంగా హరిత ఇంధనం - GREEN HYDROGEN HUB IN ATCHUTAPURAM

దావోస్‌ వేదికగా ప్రపంచ పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు-గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు విస్తృత ప్రచారం

atchutapuram_as_a_hub_for_green_hydrogen_and_green_energy
atchutapuram_as_a_hub_for_green_hydrogen_and_green_energy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 1:37 PM IST

Atchutapuram as a Hub for Green Hydrogen and Green Energy : గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ ఎనర్జీలకు కేంద్రంగా అచ్యుతాపురం ఆవిర్భవించనుంది. వాతావరణానికి ఎటువంటి హాని లేకుండా పూడిమడక గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ను నిర్మించేందుకు సీఎం చంద్రబాబు పూనుకున్నారు. ప్రణాళికాబద్ధంగా దీనిని పట్టాలెక్కించడానికి చర్యలు చేపడుతున్నారు. దేశ భవిష్యత్తు ఇంధన అవసరాలు తీరేలా దీనిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.

దావోస్‌లో జరిగిన సదస్సులో ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పూడిమడక వద్ద నిర్మించనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ను పరిచయం చేస్తూ చంద్రబాబు ప్రసంగించారు. దీంతో దీని ప్రాధాన్యం ఒక్కసారిగా విశ్వవ్యాప్తమైంది. ఇంధన, విద్యుత్తు సంస్కరణలో ముందుండే చంద్రబాబు గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు లక్ష్యాలను ప్రపంచ వేదికగా వివరించి అందరినీ ఆలోచింపజేశారు.
సెజ్‌ పరిధిలో 1200 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత పెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టును పూడిమడక వద్ద నిర్మించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. 25 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌టీపీసీ, ఏపీ జెన్‌కోలు రూ.1.85లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోపాటు రాష్ట్ర అవసరాలకు దీనిని నుంచి నేరుగా హైడ్రోజన్‌ తీసుకోవాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఏపీ జెన్‌కో నుంచి దీనిలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.

భావనపాడులో పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు చేయండి - లక్ష్మీమిత్తల్‌ను కోరిన నారా లోకేశ్‌

భవిష్యత్తు ఇంధనం : చమురు నిల్వలు తగ్గిపోవడం, బొగ్గు వల్ల పెరుగుతున్న కాలుష్యం, సహజ ఇంధన ధరలు రోజురోజుకి పెరిగిపోవడడం వల్ల ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. దీనిలో భాగంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ వల్ల ఇంధన ధరలు అదుపులోకి రావడం, నష్టాలు తగ్గిపోవడం, ఉత్పత్తి పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం తగ్గి కార్బన్‌ ఉద్గారాలు తగ్గనున్నాయి. పూడిమడక ప్రాజెక్టుతో దేశ ఇంధన అవసరాలు తీరడంతోపాటు మిగిలిన ప్రాజెక్టులకు ఇది నమూనాగా నిలవనున్నది. ప్రాజెక్టు పూర్తయితే అచ్యుతాపురం మండల స్వరూపమే మారిపోనుంది.

ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో : పూడిమడక ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో దీనిని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1200 ఎకరాల్లో 300 ఎకరాల్లో మౌలికవసతులు, 300 ఎకరాల్లో హబ్, మరికొంత భాగంగా గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. పనులు మూడేళ్లల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ సభ కోసం వంద ఎకరాల వరకు స్థలాన్ని చదును చేశారు. మిగిలిన ప్రాంతంలోనూ వాల్టా పన్ను చెల్లించి చెట్లు తొలగించడానికి ఎన్టీపీసీ అధికారులు ముందడుగు వేస్తున్నారు.

రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ హబ్ - ప్రభుత్వానికి APIIC ప్రతిపాదనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.