ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వెనుక గేటు నుంచి అసెంబ్లీకి వచ్చిన జగన్‌ - ప్రమాణం చేసి సభలో కూర్చోకుండానే! - Jagan Entered From Back Gate

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 11:37 AM IST

Jagan Entered to Assembly From Back Gate: వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి జగన్‌ చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లలేదు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టి, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు.

Jagan Entered to Assembly From Back Gate
Jagan Entered to Assembly From Back Gate (ETV Bharat)

Jagan Entered to Assembly From Back Gate: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేటు నుంచి వైఎస్ జగన్ ప్రాంగణానికి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రూటు మార్చి అమరావతి రైతుల శిబిరం వైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జగన్ సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్‌లోనే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి, ప్రొటెం స్పీకర్​కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్​కు వెళ్లిపోయారు.

రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - cm chandrababu entered to assembly

అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతి:మరోవైపు జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అసెంబ్లీకి బయల్దేరే ముందే ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించారు. కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దాని కనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు.

సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌ - AP Assembly Sessions 2024

ABOUT THE AUTHOR

...view details