Jagan Cheated People by Falsely Promising to Ban Alcohol:ఒక్క మద్యం దుకాణం కూడా కనిపించదని ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు హామీ ఇచ్చారు. జగన్ చెప్పిందే నిజమైతే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క మద్యం దుకాణం కూడా కనిపించకూడదు. కానీ ఆ పరిస్థితి ఉందా? జగన్ మాటమీద నిలబడే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు మందు దొరకని ఊరు లేదు. కొన్ని గ్రామాల్లో రెండు, మూడు బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే బెల్టుషాపులు నడిపిస్తున్నారు. వీటిలో క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే అదనంగా 40 నుంచి 50 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి కనీసం వేల 3 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో 15 వేల కోట్ల రూపాయల వరకూ దోచేశారు. ఇక బార్లైతే బార్లా తెరిపించారు తూగేదాకా తాగించారు.
జగన్ సభకు బస్సులు - జనానికి తప్పని తిప్పలు - CM Jagan Meetings
గతంలో బార్లు లేనిపురపాలికలు, నగరపంచాయతీల్లోనూ కొత్తగా ఏర్పాటు చేయించారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాక్-ఇన్ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్‌లెట్లు ప్రారంభించారు. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్షంలో ఉండగా సుద్దులు చెప్పారు జగన్. అధికారంలోకొచ్చాక అదే మద్యం ఆదాయాన్ని ఫుల్లుగా పెంచుకున్నారు. 2014 నుంచి 2019 మార్చి మాసాంతం వరకూ తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో 75 వేల 285 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే వైసీపీ ఐదేళ్ల ఏలుబడిలో అమ్మింది అక్షరాలా లక్షా 24 వేల 333కోట్లు. అంటే, గత ప్రభుత్వంతో పోల్చితే వైసీపీ హయాంలో 49 వేల 47 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని అదనంగా అమ్మారు.