TTD Chairman BR Naidu meets CM Chandrababu : తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీర్ నాయుడు తెలిపారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో బీఆర్ నాయుడు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. వారానికి రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Chandrababu Letter to CM Revanth Reddy : తిరుమల శ్రీవారి దర్శనాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరు చేయుటకు ఆదేశాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వారంలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అవకాశం ఇవ్వాలని గతంలో సీఎం చంద్రబాబుకు లేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాశారు. రేవంత్ లేఖ మేరకు తిరుమలలో అవకాశం కల్పిస్తున్నట్లు చంద్రబాబు జవాబు ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారము ఏదైనా రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, మరో 2 రోజులు 300 టిక్కెట్లు అనుమతిస్తామని వివరించారు. ప్రతీ టిక్కెట్‌పై ఆరుగురు భక్తులు దర్శనం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. సోమవారం నుంచి గురువారం మధ్య ఈ లేఖలకు అనుమతి ఉంటుందని సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
బాలయ్య రికార్డు చెరిపేసిన రామ్‌చరణ్ - 38ఏళ్లుగా అదే అతిపెద్దది
పాత ఒప్పందాలు రద్దు! - ఇకపై అన్ని ఆలయాల్లో ఆ నెయ్యినే వాడాలి