LIVE: సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2024, 4:06 PM IST
|Updated : Dec 30, 2024, 4:58 PM IST
CM chandrababu Press Meet at Secretariat: సీఎం చంద్రబాబు నేడు పలు విషయాలపై సమీక్షలు నిర్వహించారు. ఉదయం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. శనివారం జలవనరులు శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించే అంశంపై కీలకంగా చర్చించారు. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎగువున ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరో వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్దం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 30, 2024, 4:58 PM IST