తెలంగాణ

telangana

ETV Bharat / state

సినీ ప్రముఖుల కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ దాడులు - దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత - IT RAIDS ON DIL RAJU OFFICE

దిల్‌రాజు, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో సోదాలు - పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం - రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్‌ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత

IT Raids On Dil Raju and Mythri Movie Makers Offices
IT Raids On Dil Raju and Mythri Movie Makers Offices (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 12:00 PM IST

Updated : Jan 23, 2025, 8:08 PM IST

IT Raids On Dil Raju and Mythri Movie Makers Offices :హైదరాబాద్‌లో మూడో రోజు గురువారం కూడా ఐటీ(ఆదాయపు పన్నుశాఖ) దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, మైత్రీ మూవీస్‌, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్​ చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లుగా గుర్తించారు.

పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఈ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్‌ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దర్శకుడు సుకమార్ ఇంట్లో మధ్యాహ్నం సోదాలు ముగిశాయి.

స్పందించిన అనిల్ రావిపూడి :నిర్మాతదిల్​ రాజు ఇళ్లు, ఆఫీసుపై ఆదాయపు పన్నుశాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్​ రావిపూడి స్పందించారు. ఐటీ దాడులనేవి దిల్​రాజుపైనే కాకుండా చాలా మందిపై జరుగుతుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అనే పేరుతో సినిమా తీశామన్న ఆయన ఐటీ వాళ్లు కూడా సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని అనిల్​ రావిపూడి అన్నారు. రెండేళ్లకు ఓసారి ఐటీ సోదాలు సర్వసాధారణమని అనిల్​ అభిప్రాయపడ్డారు. తనపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే కాదు, మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నాయి : దిల్‌ రాజు

దిల్‌రాజు, పుష్ప-2 నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు - కీలకపత్రాలు స్వాధీనం

Last Updated : Jan 23, 2025, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details