Irrigation Societies Election Process Postponed in AP :రాష్ట్రంలోగురువారం జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కలెక్టర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం పంపింది. ఇటీవల వచ్చిన తుపాను, భారీ వర్షాల కారణంగా సాగునీటి సంఘాల ఎన్నికలను వాయిదా వేస్తునట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి నోటిఫికేషన్ తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికలు ఈనెల 8న జరగాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఈ నెల 11న, ప్రాజెక్టు కమిటీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగాల్సి ఉంది.
తప్పులతడకగా ఓటర్ల జాబితా :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటి సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా తప్పులతడకగా విడుదలైంది. దీనిని పరిశీలించుకున్న రైతులు ఒక్క ఓటు ఉండాల్సి ఉండగా ఎన్ని సర్వే నంబర్లు ఉంటే అన్ని ఓట్లు ఉండడంతో అయోమయంలో పడ్డారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నీటి సంఘం ఎన్నికల సంబంధించిన ఓటర్ల జాబితే ఇందుకు నిదర్శనం. ఎన్నో ఏళ్లుగా జరగని నీటి సంఘాల ఎన్నికలను ఈ సారి ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన నిర్వహించాలని ప్రణాళికలను సిద్ధం చేసింది.