Underpass from Undavalli to Mangalagiri At Anantha Padmanabha Swamy Caves : రెండో శతాబ్ద కాలంలోనే కొండల మధ్యలో సొరంగం మార్గం తవ్వి రాకపోకలు సాగించేవారంటే విచిత్రమే కదా. ఇది ఎక్కడో కాదండోయ్. గుంటూరు జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉండవల్లిలోని అనంతపద్మనాభస్వామి గుహల నుంచి మంగళగిరిలోని పానకాలస్వామి ఆలయం వరకు 9 కి.మీ పొడవునా భూగర్భ మార్గం ఉండేదట.
రెండు, మూడు శతాబ్దాల క్రితం పూర్తిగా అడవి, కృష్ణానది విస్తరించి ఉన్న ప్రాంతం కావడంతో మునులు రాకపోకల కోసం ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. క్రీస్తుశకం 2, 3 శతాబ్దాల్లో బౌద్ధమతం ప్రాచుర్యం పొందుతున్న రోజుల్లో వీటిని నిర్మించి ఉండవచ్చని చరిత్ర చెబుతోంది. ఉండవవల్లి కొండలో ఉన్న ఒకే రాతిలో నాలుగంతస్తులుగా గుహలు నిర్మించారు. అప్పట్లో విష్ణు కుండినులు, బౌద్ధ భిక్షువుల కోసం వీటిని నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు.
సహజ శివలింగం వద్ద భక్తురాలి తపస్సు - ఎట్టకేలకు ఆ గుహలకు దారి
బౌద్ధారామాలు నిర్మించిన గోవిందశర్మ గుహలను నిర్మించారని చెబుతారు. ఉండవల్లి కొండపై నాలుగంతస్తులుగా 64 గుహల నిర్మాణం జరిగింది. ఇందులో మొదటి అంతస్తుల్లో 11 గుహలు ఉండగా రెండో అంతస్తుకు వెళ్లే మెట్ల మార్గంలో సొరంగ మార్గం ఉంది. సొరంగానికి ఎదురుగా రెడ్డిరాజుల నాటి శిలాఫలకం రాతితో చెక్కి ఉంటుంది. ఈ గుహలు చూడడానికి అందరూ వెళ్లొచ్చు. గుహ లోపల నుంచి వెళ్లే మార్గాలను ప్రస్తుతం మూసివేశారు. ఈ గుహలను చూడాలంటే విజయవాడ, మంగళగిరి బస్టాండ్ నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి.
ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పలు పర్యాటక ప్రాంతాల్లో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పర్యటకుల మనసు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఉండవల్లిలోని అనంతపద్మనాభస్వామి గుహల నుంచి మంగళగిరిలోని పానకాలస్వామి ఆలయం వరకు 9 కి.మీ పొడవునా భూగర్భ మార్గాన్ని గుహలను చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు.
'బిల్వస్వర్గం గుహల్లో' వైఎస్సార్సీపీ విధ్వంసకాండ - 26 లక్షల ఏళ్ల నాటి చరిత్ర ధ్వంసం