IPS Officer Rajiv Ratan Funeral : హైదరాబాద్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌రతన్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు పలువురు సైనిక అధికారులు హాజరై నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం(Rajiv Funeral With State Honor) అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.
IPS Officer Rajiv Ratan Death :మంగళవారం ఉదయం కుమారుడితో కలిసి రాజీవ్‌రతన్ జాగింగ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురై విపరీతమైన గుండెనొప్పితో బాధపడగా ఆయన కుమారుడు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
సమర్థ అధికారిగా గుర్తింపు
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్ సమర్థ అధికారిగా పేరొందారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై(Medigadda Project) విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర పోలీస్‌శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజీవ్ రతన్‌కు పోలీస్‌శాఖలో ముక్కుసూటి అధికారిగా పేరుంది. సుదీర్ఘ కాలం పోలీసు విభాగానికి ఆయన విశిష్ఠ సేవలు అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.