తెలంగాణ

telangana

ETV Bharat / state

జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే ​ - Interim Bail For Jani Master - INTERIM BAIL FOR JANI MASTER

Interim Bail For Jani Master : అత్యాచార ఆరోపణలపై అరెస్టైన డ్యాన్స్​ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని కోరుతూ జానీ మాస్టర్​ బెయిల్​కు దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది.

Interim Bail For Jani Master
Interim Bail For Jani Master (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 11:46 AM IST

Updated : Oct 3, 2024, 2:11 PM IST

Interim Bail For Jani Master :సహాయ కొరియోగ్రాఫర్​పై లైంగిక వేధింపు కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​కు రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. దిల్లీలో జాతీయ అవార్డు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రంగారెడ్డి ఫోక్సోకోర్టులో జానీ మాస్టర్​ పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. మళ్లీ 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. రూ.2 లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని తెలిపింది.

మధ్యంతర బెయిల్​ సమయంలో మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని కోర్టు జానీ మాస్టర్​కు ఆదేశించింది. దీంతో పాటు మరోసారి మధ్యంతర బెయిల్​కు అప్పీల్​ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా ధనుశ్​ నటించిన తిరు అనే తమిళ్​ సినిమాలోని 'మేఘమ కరుకథ' అనే పాటకు జానీ మాస్టర్​కు ఉత్తమ కొరియోగ్రాఫర్​గా జాతీయ అవార్డు కేంద్రం ప్రకటించింది. ఈనెల 8న దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జానీ మాస్టర్​ ఈ అవార్డును అందుకోనున్నారు.

Last Updated : Oct 3, 2024, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details