Inter Exam Hall Tickets Telangana 2024 :తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు(TS Inter Hall Tickets) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా విద్యార్థులే తమ హాల్‌టికెట్లను నేరుగా పొందేలా అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇక ఇంటర్ పరీక్షలు(Inter Exams) ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
అసలు ఎలా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి :
- ప్రథమ ఇంటర్ విద్యార్థులైతే ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లు పొందొచ్చు. ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
- ద్వితీయ ఇంటర్ విద్యార్థులైతే రోల్ నంబరు, గత ఏడాది హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి పొందొచ్చు. సెకండ్ ఇయర్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
- బ్రిడ్జి కోర్సు విద్యార్థులైతే ఎస్ఎస్సీ పరీక్ష నంబరు, రోల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రిడ్జి కోర్సు హాల్‌టికెట్ల డౌన్లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
EAMCET Exam Preparation Tips : ఇలా ప్రిపేర్ అయితే.. ఎంసెట్‌లో మంచి ర్యాంకు పక్కా