8 Years Jail Punishment Imposed To Sai Varshith in White House Attack Case :గతేడాది మే 22న అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడికి వెళ్లిన భారతి సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్‌కు అక్కడి కోర్టు 8 ఏళ్ల జైలు జైలు శిక్ష విధించింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హైస్ వద్ద 2023లో భారతి సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌కు స్థానికి కోర్టు తాజాగా 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాడీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొన్నారు.
ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీ కొట్టిన కందుల సాయి వర్షిత్ :కోర్టు పత్రాల ప్రకారం 2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల సమయంలో వైట్‌హౌస్ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. అప్పడే పాదచారులు భయపడి పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీ కొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీ కొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.