Indalwai Toll Plaza Got Gold Medal :రహదారుల నిర్వహణలో పోటీతత్వం తీసుకొచ్చేందుకు 2018 నుంచి ఏటా కేంద్రం అవార్డులు ఇస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్దేశించిన ఆరు అంశాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులకు బంగారు, వెండి పురస్కారాలు లభిస్తాయి. 2022 ఏడాదికి గానూ ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును గత నెల 6న దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌సింగ్ అందుకున్నారు.
Excellence in Operation and Maintenance Flexible Award : ఇందల్వాయిటోల్‌ప్లాజా (Toll Plaza) నిర్వహిస్తున్న అథాంగ్ కంపెనీ చేసిన మార్పులే ఈ అవార్డును తెచ్చిపెట్టాయి. రహదారి నిర్వహణతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటడం, విభాగిని మధ్యలో మొక్కల సంరక్షణ, విద్యుద్దీపాల నిర్వహణ, రహదారిపై గుంతలు లేకుండా చూడటం, టోల్‌ప్లాజాలో నిరంతరం పనిచేసేలా కంట్రోల్ రూమ్ నిర్వహించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయి. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అత్యవసర టెలిఫోన్, ప్రమాదాలు పసిగట్టేందుకు రెండు రూట్లలో పెట్రోలింగ్ వాహనాలు, అత్యవసర అంబులెన్స్ అందుబాటులో ఉంచడం వంటివి ఈ టోల్‌ప్లాజా పరిధిలో నిర్వహిస్తున్నారు. వీటన్నింటికి గాను జాతీయ స్థాయి అవార్డు లభించిందని నిర్వాహకులు అంటున్నారు.
రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులు..!
ప్రమాదం జరిగినప్పుడు స్పందించే తీరు :నిర్వహణతో పాటు రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు స్పందించే తీరు కూడా ఈ అవార్డు రావడానికి కారణమైంది. గతంలో ఈ రహదారిపై వాహనం బోల్తా పడితే రోజుల తరబడి అక్కడే ఉండేది. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. చాలా సందర్భాల్లో ఇవి మరిన్ని ప్రమాదాలకు కారణయ్యేవి. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి టోల్‌ప్లాజా సిబ్బంది చేరుకోవాల్సిన గరిష్ఠ సమయానికి గరిష్ఠ ప్రతిస్పందనగా పరిగణిస్తారు.