Heavy Rains In Telangana : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్ధపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు సిద్దం అయ్యారు. ఏవైనా వరద సమస్యలు తలెత్తితే వెంటనే సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
తెలంగాణలో రేపు భారీ వర్షాలు :మరోవైపు రేపుకుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.