తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - రానున్న 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు! - IMD ALERT TO TELANGANA - IMD ALERT TO TELANGANA

IMD Alert to Telangana : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడిందని, దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana Weather Report
IMD Alert to Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 4:30 PM IST

Telangana Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

శనివారం రోజు భారీ వర్షాలు : అల్పపీడనం ప్రభావంతో ఎల్లుండి శనివారం నాడు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహాబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్ధపల్లి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ సంచాలకులు వివరించారు.

మరోవైపు రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ ఉండాలని గ్రేటర్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం : మరోవైపు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల 30న పశ్చిమ - మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల మీదుగా దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ-మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

హెచ్చరిక : వర్షాకాలంలో కరెంటుతో జాగ్రత్త - ఇంట్లో ఈ పనులు అస్సలు చేయొద్దంటున్న విద్యుత్ అధికారులు! - Rainy Season Precautions

వర్షం వల్ల ఇంట్లో తేమ పెరిగిపోయిందా? డోంట్​ వర్రీ - ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​! - How To Reduce Humidity In Home

ABOUT THE AUTHOR

...view details