Hydra Focused on Hyderabad Problems :హైదరాబాద్ నగరంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని హైడ్రా నిర్ణయించింది. నెల రోజులుగా కమిషనర్ ఏపీ రంగనాథ్ వివిధ రంగాల నిపుణలతో సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కూల్చివేతల కోసమే హైడ్రా ఏర్పడిందన్న ముద్రను చెరిపివేసుకోవాలన్న భావనతో ఉన్న అధికారులు, ఇతర సమస్యలపై దృష్టి సారించనున్నారు. దీంతో కూల్చివేతలు తాత్కలికంగా ఆపేయాలని నిర్ణయించారు.
ట్రాఫిక్‌పై ఫోకస్ : రాజధానిలో నిత్యం 50లక్షలకు పైగా వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. చిన్నపాటి వాన పడినా గంటల తరబడి రోడ్లపై ఉండాల్సిందే. ఈ సమస్యపై ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులతో కలిసి పరిష్కారించాలని ఆలోచిస్తున్నారు. దీని పరిష్కృతం కోసం రెండు విద్యా సంస్థలకు సర్వే బాధ్యతలు అప్పగించారు. పరిష్కారాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్‌పాత్, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.
చెరువుల పరిరక్షణ :నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం తీసిన ఫొటోలు, మ్యాప్‌లతో చెరువు వాస్తవ విస్తీర్ణం, మొత్తం చరిత్రను తీసి నిక్షిప్తం చేసేందుకు యత్నిస్తున్నారు. చెరువులపై ఉన్న ఆక్రమణల్లో దాదాపు 85శాతం నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. వీటిని కూల్చడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డ హైడ్రా అధికారులు ఉన్న చెరువును పరిరక్షించాలని నిర్ణయించారు. నగరంలోని కొన్ని చెరువుల సుందరీకరణను నవంబరులో ప్రారంభించాలని యోచిస్తున్నారు.
ఆ ఒక్క ప్రశ్నతో రంగంలోకి 'హైడ్రా' - దానికోసమే ఇదంతా - మీకు తెలుసా?