తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ స్థలంలో ఫంక్షన్‌ హాల్‌ - నేలమట్టం చేసిన హైడ్రా - HYDRA DEMOLITIONS AT SECUNDERABAD

సికింద్రాబాద్‌లోని జనహర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు - ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినందుకు ఫంక్షన్‌ హాల్‌ నేలమట్టం

Hydra Demolitions at Jawahar nagar Function Hall
Hydra Demolitions at Jawahar nagar Function Hall (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 1:59 PM IST

Hydra Demolitions at Jawahar nagar Function Hall : సికింద్రాబాద్​లోని జవహర్​నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కౌకుర్‌ డీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్‌ హాల్‌ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో ఫంక్షన్‌ హాల్‌ ప్రహరీ గోడతో పాటు ఫంక్షన్‌ హాల్‌ను నేలమట్టం చేశారు. సర్వే నంబర్‌ 14లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబరు 14లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే నంబరు 25లో ఉన్న ప్రైవేటు స్థలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details