ETV Bharat / international

అక్రమ వలసదారులను తిప్పి పంపుతా- మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా చూస్తా: ట్రంప్ - TRUMP DEPORTATION EXERCISE

అమెరికా నుంచి అక్రమ వలసదారులను తిప్పి పంపుతా- టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఆపుతా - మాగా విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Donald Trump
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 10:06 AM IST

Trump Deportation Exercise : ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వాషింగ్టన్ వేదికగా నిర్వహించిన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (మాగా) విజయోత్సవ ర్యాలీలో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపుతానన్నారు.

త్వరలోనే అక్రమ వలసదారులపై కొరడా!
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా, త్వరలోనే భారీగా అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపే కార్యక్రమాన్ని మొదలుపెడతామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్ టాక్‌ను కాపాడతామని ఆయన వెల్లడించారు. దేశంలో ఉద్యోగాల కోతను ఆపేందుకు టిక్‌టాక్‌ను గట్టెక్కిస్తానని తెలిపారు. అమెరికాలో జరిగే వ్యాపారాన్ని చైనాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అమెరికాలోని టిక్ టాక్ వ్యాపారంలో 50 శాతం వాటాను అమెరికా కంపెనీకి ఇస్తే దాని కార్యకలాపాలకు అనుమతిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. "నేను టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని కాపాడేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తాను. ఆ కంపెనీని అమెరికా సంస్థకు విక్రయించేందుకు మరింత గడువు ఇస్తాను" అని ఆయన తెలిపారు.

అమెరికాను మళ్లీ పైకితెస్తాం
"గత నాలుగేళ్లుగా అమెరికా క్షీణతను చూసింది. ఆ క్షీణ దశకు ఇప్పుడు తెరపడింది. ఇక మేం అమెరికాను మళ్లీ పైకి తెస్తాం. ఎందుకంటే మేం గెలిచాం" అని ట్రంప్ తెలిపారు. దేశంలోని అవినీతిమయ రాజకీయ వ్యవస్థను అంతం చేస్తామన్నారు. "అమెరికా ఎన్నికల ఫలితాలను చూసి అందరూ ట్రంప్ ఎఫెక్ట్ అన్నారు. కానీ ఇది వాస్తవానికి మీ(ప్రజల) ఎఫెక్ట్" అని ఆయన తెలిపారు. "అమెరికాపై విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంచేలా స్కూళ్లను మారుస్తాం" అని చెప్పారు.

"మేం ఎన్నికల్లో గెలవడం వల్లే అమెరికాలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రఖ్యాత సాఫ్ట్ బ్యాంక్ మన దేశంలో 100 బిలియన్ డాలర్ల నుంచి 200 బిలియన్ డాలర్ల దాకా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ దిశగా ప్రకటన చేశారు" అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకు ముందు వర్జీనియాలోని అర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్, కాబోయే దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఆ శ్మశాన వాటికలోని గుర్తుతెలియని సైనికుల సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

అమెరికా అధ్యక్షుడి అధికారాలు, విధులేంటి? ట్రంప్ 'సూపర్ పవర్స్' తెలిస్తే షాకే!

ట్రంప్​నకు బైడెన్ 'అభినందన లేఖ' - రాస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.