ETV Bharat / entertainment

వెంకీ మామ అరుదైన రికార్డ్- 'RRR' తర్వాత రెండో మూవీగా ఘనత - SANKRANTIKI VASTHUNNAM COLLECTION

బాక్సాఫీస్ వద్ద 'సంక్రాంతికి వస్తున్నాం' జోరు- ఓవర్సీస్​లో అరుదైన క్లబ్​లో చేరిన వెంకీ మామ

Sankrantiki Vasthunnam
Sankrantiki Vasthunnam (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 10:04 AM IST

Sankrantiki Vasthunnam Collection : దగ్గుబాటి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్​ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్​ఫుల్ షోలతో ప్రదర్శితమౌతూ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం మరో అరుదైన రికార్డు కొట్టింది.

ఐదో రోజైన అదివారం ఈ చిత్రం రూ.12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తొలి స్థానంలో 'ఆర్‌ఆర్ఆర్‌' (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో ప్లేస్​లో 'సంక్రాంతికి వస్తున్నాం' (రూ.12.75కోట్లు) నిలిచింది. ఇక ఆ లిస్ట్​లో మూడులో 'అల వైకుంఠపురం' (రూ.11.43 కోట్లు), నాలుగులో 'బాహుబలి 2' (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో రూ.10.86 కోట్లతో 'కల్కి 2898 ఏడీ' సినిమాలు ఉన్నాయి.

అక్కడ కూడా
ఓవర్సీస్​లోనూ వెంకటేశ్ హవా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్​లో చేరింది. వెంకటేశ్ కెరీర్​లో ఈ మైలురాయి అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో హీరో వెంకీ ఓవర్సీస్ ఆడియెన్స్​కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్​ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

100 మిలియన్ క్లబ్​
ఈ సినిమాలో గోదారి గట్టుమీద రామచిలకవే పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఒక్క తెలుగులోనే ఈ పాట య్యూట్యూబ్​లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

కాగా, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ ఫీమేల్ లీడ్స్​లో నటించారు. సీనియర్ నటుడు నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పాత్రలు పోషించారు. భీమ్స్​ సిసిరొలియో చక్కటి సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

'మై బ్రదర్ మహేశ్​కు థాంక్స్​, అందుకు నేను సో హ్యాపీ'- వెంకటేశ్

'సంక్రాంతికి వస్తున్నాం' క్రేజీ రెస్పాన్స్- ఆడియెన్స్​ కోసం 220 షోలు ఎక్స్ ట్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.