తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగం పేరిట తండ్రి మోసం! - వేధింపులు భరించలేక పరిశోధక విద్యార్థిని సూసైడ్ - RESEARCH STUDENT COMMITS SUICIDE

హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్య - తండ్రి చేసిన తప్పునకు కానిస్టేబుల్‌ వేధింపులు - భరించలేక ఉరేసుకుని తనువు చాలించిన యువతి

Hyderabad Young Girl Committed Suicide Over Debt
Hyderabad Young Girl Committed Suicide Over Debt (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2024, 8:53 AM IST

Updated : Dec 27, 2024, 9:10 AM IST

Research Student Commits Suicide Over Debt :చేయని తప్పునకు కానిస్టేబుల్‌ వేధింపులు భరించలేక పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘనట స్థానికంగా కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారంలోని బాపూజీనగర్‌ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్‌ అయ్యారు. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయముంది.

అనారోగ్య కుమార్తెను కట్టబెట్టావంటూ అల్లుడి వేధింపులు - తట్టుకోలేక మామ ఆత్మహత్య

రెండేళ్ల కిందట సంగీతరావు అనిల్‌ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్‌ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్‌కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్‌ దంపతులు న్యాయస్థానంలో సివిల్‌ దావా కూడా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన దీప్తి, రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్‌ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. పోలీసులు అనిత, అనిల్‌, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు.

విద్యార్థి (ETV Bharat)

సెల్ఫీ వీడియో తీస్తూ చెప్పిన మాటలివి :"నేను చనిపోవడానికి అనిల్‌, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి" అంటూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది.

ప్రేమ పేరుతో వేధింపులు! - యాసిడ్‌ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ఇద్దరిని నమ్మి షేర్‌ మార్కెట్లో రూ.60 లక్షలు పెట్టిన హెచ్​ఎం - లాభం, అసలు ఇవ్వకపోవడంతో?

Last Updated : Dec 27, 2024, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details