Hyderabad Police Action To Catch Ganja Smuggler Neetu Bai :గంజాయి క్వీన్ నీతూబాయి మత్తు దందా వెనుక కొందరి అధికారుల హస్తం బయటపడుతోంది. అడిగినంత ఇస్తే, ఎంత విక్రయించినా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆబ్కారీ శాఖలో ఓ ఇన్స్‌స్పెక్టర్, కొందరు ఎస్సైల ఆమ్యామ్యాల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. వీరు నిందితురాలు నీతూబాయితో ఒప్పందం చేసుకుని నెలవారీగా వసూళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోజూ రూ.లక్షల్లో విక్రయాలు చేస్తున్న నీతూబాయి కోసం ఆబ్కారీ శాఖ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె ఈ స్థాయిలో దందా చేయడానికి కారణాలేమిటని అధికారులు ఆరా తీయగా ఈ వసూళ్ల వ్యవహారం బయటపడింది.
అడిగినంత ఇస్తే నో చెకింగ్ :నీతూబాయి దాదాపు ఎనిమిదేళ్లుగా గంజాయి విక్రయాలు చేస్తోంది. ఇప్పటికే ఆమెపై పీడీయాక్టు నమోదు చేసినా మళ్లీ దందా చేసేందుకు ఆబ్కారీ శాఖలో కొందరు ఇన్‌స్పెక్టర్ల తీరే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇన్‌స్పెక్టర్ నెలకు రూ.లక్ష తీసుకుని చూసీచూడనట్లు వదిలేసేవారని, ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడి పెరిగితే కేసు నమోదు చేసేవారని సమాచారం. అయితే అతను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడికి మరో ఇన్‌స్పెక్టర్ రాగా ఏకంగా రూ. లక్షన్నర ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వారు చూసిచూడనట్లు వదిలేయాలి అంటే ఈ మొత్తం ప్రతినెలా చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
బైక్‌పై లిఫ్ట్ ఇస్తే.. నకిలీ పోలీసుతో గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరింపు