తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్రో రెండో దశ పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు తీరినట్టేనా?

రెండో దశలో ఐదు కారిడార్లలో మెట్రో రైలు - 2028 నాటికి ప్రయాణికుల అంచనా - నిత్యం అన్ని లక్షల మంది మెట్రో ప్రయాణం

Hyderabad Metro Second Phase
Hyderabad Metro Second Phase (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 12:43 PM IST

Hyderabad Metro Second Phase : "మెట్రో రైలు రెండోదశలో ఐదు కారిడార్లు రానున్నాయి. ఇందుకు సంబంధించి 2028 నాటికి ప్రయాణికుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఐదు కారిడార్లలో 76.4 కి.మీ. మార్గాన్ని ప్రతిపాదించగా.. 54 స్టేషన్లు రాబోతున్నాయి. అప్పటికి ఇవన్నీ పూర్తయితే మాత్రం ప్రతిరోజూ 7.96 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది." అని హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ మెట్రో రైలు సంస్థ అంచనా వేస్తోంది. కాంప్రిహెన్సివ్​ మొబిలిటీ ప్లాన్​ ఆధారంగా నిర్ణయానికి వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇప్పుడైతే ప్రయాణికుల అంచనాల సంఖ్యను తక్కువ చేసి చూపించామని.. వాస్తవంగా ప్రయాణికుల సంఖ్య పది లక్షల దాకా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బుధవారంతో మెట్రో ప్రారంభమై ఏడేళ్లు పూర్తి అయింది. ఇప్పటివరకు మెట్రోలో 63.40 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు.

ఆ రెండు మార్గాల్లోనే ప్రయాణికులు అత్యధికం :

  • ప్రస్తుతం నాగోల్​ నుంచి శంషాబాద్​ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదనలు రెండో దశలోనే ఉన్నాయి. ఇదే మార్గానికి ఎల్బీనగర్​, చాంద్రాయణ గుట్ట వద్ద పాత కారిడార్లను అనుసంధానం చేయనున్నారు. దీంతో విమానాశ్రయ కారిడార్​లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 3.70 లక్షల మంది దాకా ఉంటారని ఓ అంచనా. ఇక్కడే అత్యధికంగా ప్రయాణికులు రెండో దశలో ప్రయాణిస్తారు.(నాగోల్​ టూ శంషాబాద్​)
  • అలాగే మియాపూర్​ నుంచి పటాన్​చెరు మార్గంలో 1.65 లక్షల(రెండో అత్యధికం) మంది ప్రయాణిస్తారని ఓ అంచనాకు అధికారులు వచ్చారు. మిగతా కారిడార్లలో లక్షలోపే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాతో ఈ లెక్కలు మెట్రో వేసుకుంది.

ప్రయాణించే ప్రయాణికుల అంచనా పట్టిక :

కారిడార్ మార్గం కి.మీ. స్టేషన్లు ప్రయాణికుల అంచనాలు(2028)
4 నాగోల్​- విమానాశ్రయం 36.8 24 3,70,000
5 రాయదుర్గం - కోకాపేట 11.6 8 92,000
6 ఎంజీబీఎస్​-చాంద్రాయణగుట్ట 7.5 6 72,000
7 మియాపూర్​-పటాన్​చెరు 13.4 10 1,65,000
8 ఎల్బీనగర్​- హయత్​నగర్ 7.1 6 97,000

తొమ్మిదో స్థానానికి పడిపోయే ప్రమాదం : ఈనెల 26న మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గత పదేళ్లలో మెట్రో మార్గాల విస్తరణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో దిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్​ మూడో స్థానానికి పడిపోయిందని ఆయన అన్నారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టకపోతే హైదరాబాద్​ తొమ్మిదో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. బెంగళూరు, ముంబయి, చెన్నై నగరాల్లో రూ.50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయని తెలిపారు. హైదరాబాద్​లోనూ మెట్రో విస్తరణకు డిమాండ్​ పెరిగింది. దీంతో రెండోదశ ప్రతిపాదనలు సీఎం రేవంత్​కి వివరించినట్లు ఆయన చెప్పారు.

ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతాం : ఎన్వీఎస్‌రెడ్డి

హైదరాబాద్​ మెట్రోకు ఏడాదికి రూ.1,300 కోట్లు నష్టం - షాకింగ్ న్యూస్ చెప్పిన ఎండీ

ABOUT THE AUTHOR

...view details