Metro MD Focus On Airport Metro Corridor :హైదరాబాద్ మెట్రోరైల్‌ప్రాజెక్టు విస్తరణలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్‌లో కదలిక మొదలైంది. నాగోలు నుంచి చంద్రాయణగుట్ట మీదుగా విమానాశ్రయాన్ని కలిపే కారిడార్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. మెట్రో ఉన్నతాధికారులతో పాటు కన్సల్టెన్సి సిస్ట్రా ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి 14 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు
Airport Metro Corridor expansion : నాగోలు - ఎయిర్‌పోర్ట్ మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రోస్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌కి దగ్గరలో ఎల్బీనగర్ వైపు నిర్మించనున్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఆ రెండుస్టేషన్లని కాన్‌కోర్స్ లెవల్‌లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని ఎండీ ఆదేశించారు. నాగోల్స్టేషన్ తర్వాత మూసీనది వంతెనపై ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు, భూగర్భహైటెన్షన్ విద్యుత్ కేబుళ్ల దృష్ట్యా ఎలైన్‌మెంట్‌ని మరో 10 మీటర్లు ఎడమవైపునకు జరపాలని ఎండీ సూచించారు.
మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికని దృష్టిలో ఉంచుకొని మూసీపై పొడవైన స్పాన్‌లతో వంతెన నిర్మించాలని నిర్దేశించారు. మూసీ దాటాక కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీనిస్తూ చుట్టుప్రక్కల ఉన్న కాలనీవాసుల అవసరాల కోసం అదనపు స్టేషన్‌కోసం ప్రణాళిక తయారుచేయాలని సూచించారు.
విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానం :ప్రతిపాదిత నాగోల్ ఆర్టీఓ స్టేషన్ అల్కాపురి జంక్షన్‌కి సమీపంలో నిర్మించాలని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఫ్లైఓవర్ కుడి వైపున ఉన్న కామినేని ఆస్పత్రి స్టేషన్ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్ దగ్గరలో ఉన్న అండర్‌పాస్, రెండు ఫ్లైఓవర్‌ల నిర్మాణాలతో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు ఎదుర్కోవల్సి ఉందని జంక్షన్ కుడివైపున ఉండే కొత్త స్టేషన్‌ని కారిడార్-Iలోని ప్రస్తుత ఎల్బీనగర్ స్టేషన్‌కు విశాలమైన స్కైవాక్‌తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు. బైరామల్‌గూడ, సాగర్‌రోడ్ జంక్షన్‌లో ఇప్పటికే ఎత్తైన పై వంతెన ఉన్నందున విమానాశ్రయం మెట్రోలైన్ ఎత్తు ఎక్కువగా పెంచాల్సిఉందని చెప్పారు.