Special Story on Padma Priya Vummaji Teacher : నిత్య జీవితంలో ప్రతీది లెక్కలతో ముడిపడి ఉంటుంది. ఈ పని చేస్తే ఏం లాభం చేయకపోతే ఏం నష్టం ఇలా ప్రతి ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారు. గణితం లేనిదే రోజు గడవదు. జీవితంలో భాగమైన లెక్కలను తరగతి గదిలో నేర్చుకోవటం మాత్రం అందరికి ఆసక్తి ఉండదు. అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు వచ్చే ఎంతో మంది విద్యార్థులకు లెక్కలంటే భయమంటే అతిశయోక్తి కాదు. అలాంటి గణితాన్ని సులభంగా బోధించటమే కాదు కాన్సెప్ట్ ప్రకారం చెబితే పిల్లలు వాటిని జీవితకాలం గుర్తుంచుకుంటారు అంటారు మలక్‌పేటలోని గవర్నమెంట్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ.
పద్మప్రియ ఉమాజీకి చిన్నప్పటి నుంచే గణితమంటే ఎంతో ఇష్టం. తనతోటి వారికి గణింతంలో సందేహాలను నివృత్తి చేసే పద్మప్రియ అదే సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఆంగ్ల మాధ్యమంలో డీఎస్సీ రాసీ మొదటి ర్యాంకు సాధించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు.
ఆడిస్తూ లెక్కలు చెబుతూ :తొలినాళ్ల నుంచి లెక్కలను కొత్తగా చెప్పాలని పద్మప్రియ తపనపడేవారు. అలా తరగతి గదిలో ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తూ గణితాన్ని బోధించేవారు. వారితో కలిసి ఆటలు ఆడేవారు, ఆ ఆటల్లోనే ఓ లెక్క ఉందని నేర్పించేవారు. గ్రౌండ్‌లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటూ గీతలు గీసి డైస్ వేయించి ఆటలు ఆడిస్తూ గణితం నేర్పేవారు.
"కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉంటారు. చిన్నచిన్న లెక్కలు కూడా చేయలేకపోతారు. అలాంటి విద్యార్థులను గుర్తించాము. వారు ఎందుకు ఇలా ఉన్నారో తెలుసుకున్నాం. వారికి ఎలాంటి సమస్యలున్నా, వాళ్లు ఇష్టమైన పద్ధతిలో బోధించడానికి ప్రయత్నం చేస్తాం. అలా వారి దృష్టిని లెక్కలవైపు వచ్చేలాగా చేస్తాం."- పద్మప్రియ, గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు
2016లో యూఎస్‌లో జరిగిన టీచర్ ఎక్స్‌లెన్స్ అండ్ ఎచీవ్‌మెంట్ ప్రోగ్రాంకి పద్మప్రియ ఎంపికయ్యారు. భారత్ నుంచి ఏడుగురుని ఈ కార్యక్రమం కోసం అమెరికా పంపితే అందులో ఒకరు పద్మప్రియ కావటం విశేషం. ఆరు వారాల పాటు జరిగిన కార్యక్రమంలో అక్కడ బోధనా పద్ధతులను పరిశీలించి ఇక్కడ వాటిని అమలు చేసేందుకు కృషి చేశారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి 'మిషన్ 100' - ఆవిష్కరణలే అతని ఊపిరి - tg teacher NATIONAL TEACHER AWARD