తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లికాని ప్రసాద్​లు, పురుషోత్తములకు అలర్ట్ - అలాంటి మ్యాట్రిమోనీని సంప్రదిస్తే అంతే! - HYDERABAD HONEY TRAP SCAM

మ్యాట్రిమోనీ వేదికల్లో సైబర్‌ నేరగాళ్ల నయా దందా - ఫేక్​ వెబ్‌సైట్లలో పెట్టుబడి పెట్టించి కాజేస్తారు

Hyderabad Honey Trap Scam
Hyderabad Honey Trap Scam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 10:19 AM IST

Hyderabad Honey Trap Scam :మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్లలో జీవిత భాగస్వామి కోసం వెతికే పురుషులే వారి లక్ష్యం. తెలుగులో మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉంటున్నట్లు నమ్మించి మోసం చేస్తారు. ఇద్దరం కలిసి బాగా సంపాదిద్దాం అంటూ బిట్‌ కాయిన్, స్టాక్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట రూ.కోట్లు కొట్టేస్తారు సైబర్‌ మోసగాళ్లు. మ్యాట్రిమోనీ వేదికలు, డేటింగ్‌ యాప్‌లలో యువతుల్లా నటిస్తూ హనీట్రాప్‌ చేస్తున్నారు.

Bit Coin Trading Cyber Cheating :అందమైన ఫొటోలతో ఇటీవల పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వేదికల్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీనికి తోడు డేటింగ్‌ యాప్‌ల వాడకం ఎక్కువ అవుతోంది. ఇదే అదునుగా చేసుకొని నేరగాళ్లు ఫేక్ ఫొటోలు సృష్టిస్తున్నారు. ఆన్‌లైన్‌ వెబ్‌ సైట్లలో అందమైన యువతుల ఫొటోలు సేకరిస్తారు. ఆ ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటారు. ఈ ఖాతాల ద్వారా స్నేహాం, పెళ్లికి తాము సుముఖంగా ఉన్నామంటూ మెసేజ్​లు పంపిస్తారు. అవతలి వ్యక్తి గత వివరాలు తీసుకుంటారు. ఈ తరుణంలో తాము ఇటీవల బిట్‌కాయిన్‌, స్టాక్‌ ట్రేడింగ్​లో పెట్టుబడు పెట్టి బాగా సంపాదించినట్లు వివరిస్తారు. ఈసారి ఇద్దరుం కలిసి పెట్టుబడులు పెట్టి సంపాదిస్తే జీవతంలో స్థిరపడవచ్చని అంటారు. వారే వెబ్‌సైట్లను సూచిస్తారు. అలాగే రిజిస్టర్‌ చేయిస్తారు. వీటిలో పెట్టుబడి పెట్టిన ప్రతి సారీ అధిక లాభాలు వచ్చినట్లుగా వర్చువల్‌గా చూపిస్తుంది. ఇందులో ఆ డబ్బులను విత్‌ డ్రాకు అవకాశం ఉండదు. బాధితులు డబ్బులు పంపడం ఆపేస్తే ఎవరికి దొరకకుండా పోతారు.

పురుషులే వారి లక్ష్యం ఎందుకంటే :ఎక్కువ వయసులో భాగస్వామి కోసం వెతికేవారు, విడాకుల తరువాత రెండోసారి పెళ్లి చేసుకునే పురుషులే లక్ష్యంగా ఈ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. వారిలోనూ ఎక్కువగా ధనవంతులను ఉండేలా చూసుకుంటారు. సోషల్ మీడియాలో వారి నేపథ్యం, బాధితులతో మాట్లాడినప్పుడు ఒంటరిగా ఉంటున్నారా అని వివిధ రకాలుగా తెలుసుకొని సైబర్​ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు.

రూ.94.51 లక్షల పెట్టుబడి : మాదాపూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి(46) పెళ్లి కోసం తెలుగు మ్యాట్రిమోనీని ఆశ్రయించాడు. గత సంవత్సరం ఆగస్టు రెండో వారంలో బ్రిటన్‌లో నివాసం ఉంటున్నట్లు మీనాక్షి పరిచయం అయిది. వివాహం చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన మీనాక్షి, పరిచయం పెంచుకుని కొన్ని రోజులు మాటలు కలిపింది. ఈ నేపథ్యంలోనే తాను క్రిప్టో ట్రేడింగ్‌లో డబ్బులు బాగా సంపాదించినట్లు వివరించింది. వాస్తవమని నమ్మిన ఉద్యోగి ట్రేడింగ్‌కు సిద్ధం అయ్యాడు. ఆమె చెప్పినట్లు నకిలీ వెబ్‌సైట్లో దశలవారీగా రూ.94.51 లక్షల పెట్టుబడి పెట్టాడు. దీనికి ఐదు రెట్లు లాభం వచ్చినట్లు కనిపించింది. కానీ ఆ నగదు విత్‌డ్రా చేసుకోడానికి వీలులేదు. బాధితుడు మోసపోయాడని గుర్తించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2024 మ్యాట్రిమోనీ మోసాల కేసుల సంఖ్య
హైదరాబాద్‌ 12
సైబరాబాద్‌ 53
రాచకొండ 40

వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు

ఆన్​లైన్​లో వలపు వల.. చిక్కితే జీవితాలు విలవిల

ABOUT THE AUTHOR

...view details