తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపై ప్రయాణించేదెలా? ఇరుకు రోడ్లతో ఇక్కట్లు - విస్తరణకు మోక్షమెప్పుడో

Huzur Nagar Damage Roads : చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లు కళ్లలోకి లేచిపడే దుమ్ము అడుగు తీసి అడుగేయాలంటే భయం. ఇదీ హుజూర్‌నగర్‌ పట్టణంలోని అంతర్గత రహదారుల పరిస్థితి. పట్టణం విస్తరిస్తున్నా దశాబ్దాల కాలం నాటి ఇరుకైన రోడ్లపైనే ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Huzur Nagar Damage Roads
Huzur Nagar Damage Roads

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 5:12 PM IST

రోడ్డుపై ప్రయాణించేదెలా? ఇరుకు రోడ్లతో ఇక్కట్లు - విస్తరణకు మోక్షమెప్పుడో

Huzur NagarDamage Roads : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సిమెంట్ పరిశ్రమలకు నిలయంగా పేరొందింది. దీంతో లారీలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. పట్టణంలో ప్రధానంగా పాత బస్టాండ్ ప్రాంతంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గ్రామాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణానికి మిర్యాలగూడ రోడ్డు, కోదాడ రోడ్డు కూడలిగా ఉంది. వీటి విస్తరణ ఎప్పడో జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇరుకైన రోడ్లపై(Roads) ప్రయాణాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని పాత బస్‌స్టాండ్ వద్ద ఇరుకు రోడ్లపైనే వ్యాపారాలు సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

"అధికారులు రోడ్డును ఒకవైపు వేసి ఇంకో వైపు మర్చిపోయారు. రాకాపోకలు ఒకవైపు మాత్రమే సాగిస్తున్నారు. పార్కింగ్​ లేకపోవడంతో దుకాణాలకు జనాలు రావడం లేదు. వర్షాలు పడితే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రయాణించడానికి దుమ్ము, ధూళి ఇబ్బంది పెడుతుంది. నూతన ప్రభుత్వం రోడ్లను సకాలంలో వేసి పరిష్కారం చూపాలి. వాహనాలు ఒకవైపు పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి." - దేవ్‌సింగ్‌, స్థానికుడు, హుజూర్‌నగర్

Roads Damage in Mulugu District : భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు.. నిలిచి పోయిన రాకపోకలు

Roads Damage In Huzur Nagar: హుజూర్‌నగర్​లో రోడ్లన్నీ గుంతల మయంగా మారడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని వ్యాపారస్తులు, వాహనదారులు వాపోతున్నారు. గతంలో అధికారులు రహదారుల విస్తరణకు చొరవ తీసుకున్నప్పటికీ యూజీటీ పనుల్లో అవకతవకలు జరిగాయని కోర్టు స్టే విధించింది. దీంతో పనులు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లుఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చొరవ తీసుకొని రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Hyderabad Road Problems : దయనీయంగా మారిన భాగ్యనగర రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

"గతంలో చిన్న రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరగడంతో రహదారిని విస్తరించారు. పాత బస్​స్టాండ్​ వద్ద ఇరుకైనా రోడ్డుపైనే వ్యాపారాలు సాగిస్తున్నాం. దీంతో ట్రాఫిక్​ సమస్యలు తలెత్తున్నాయి. దీనికి తోడు రోడ్లన్నీ గుంతలుగా మారాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో అధికారులు రహదారి విస్తరణకు చొరవ తీసుకున్న యూజీటీ పనుల్లో అవకతవకలు కావడంతో కోర్టు స్టే విధించింది. రోడ్డు పనులు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆగిపోయిన రోడ్లను పూర్తి చేయాలి."-వెంకటేశ్వరరావు, స్థానికుడు, హుజూర్‌నగర్

Roads Damaged in Jagtial District : భారీ వర్షాలు.. తెగిపోయిన రోడ్లు, వంతెనలు.. నిలిచిపోయిన రాకపోకలు

Telangana Floods 2023 : తెలంగాణపై వరద ప్రభావం.. 49 వంతెనలు ధ్వంసం.. విద్యుత్ సంస్థలకు రూ. 21 కోట్లు నష్టం

ABOUT THE AUTHOR

...view details