ETV Bharat / state

ఊరూ కాదు - తండా కాదు - మా 'పంచాయతీ' ఏంటో తేల్చండి మహాప్రభో!

ఆ గ్రామానికి ఊరు పేరు లేదు - ఏ గ్రామ పంచాయతో తెలియదు - 18 ఏళ్ల క్రితమే ఏర్పడిన పల్లెలో నేటికీ కష్టాలే - దుర్భర జీవితం అనుభవిస్తున్న ఆదిలాబాద్​ జిల్లాలోని గ్రామస్థులు

Unrecognized Village in Telangana
Unrecognized Village in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Unrecognized Village in Telangana : అదో ఊరు. ఉందా అంటే ఉందనే సమాధానం. దానికి పేరుందా అంటే అదీ ఉంది. కానీ అధికారిక రికార్డుల్లోకి మాత్రం రావటం లేదు. ఏదో ఓసారి సిబ్బంది తప్పిదం జరిగి ప్రస్తావనకు రావటం లేదని అనుకుంటే అదీ కాదు. అక్షరాలా 18 ఏళ్ల కిందట ఏర్పడిన ఆ పల్లె, ఇప్పటికీ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో వెల్లడి కావటం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం పరిధిలోకి వచ్చే సుందర్‌నగర్‌ గ్రామస్థుల దుస్థితి ఇది. ఈ పల్లె గురించి, పల్లెవాసుల గురించి దయనీయ గాథ.

ఊరు ఏర్పడక ముందు పద్దెనిమిదేళ్ల వెనక్కి వెళ్తే ఉమ్మడి రాష్ట్రాన 2006లో ఇంద్రవెల్లి పంచాయతీ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఏమాయికుంట గ్రామ పంచాయతీ శివారులో 90 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఆ పల్లె పేరు సుందర్‌నగర్‌గా పెట్టుకున్నా, ఇప్పటికీ ఏ గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేలలేదు. ఇళ్లు స్థలాలు పొందిన లబ్ధిదారులేమో ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీలో ఉంటే, స్థలమేమో ఏమాయికుంట పరిధిలోకి వస్తుంది. ఫలితంగా సుందర్​ నగర్​ ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో ఇప్పటికీ స్పష్టత లేదు.

"ప్రభుత్వం 2006లో భూమి కొనుగోలు పథకం కింద 4 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి మాకు ఇచ్చింది. ఇక్కడ అప్పుడు 90 కుటుంబాలకు ఇచ్చారు. అప్పటి నుంచి ఇటు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి రామూ.. ఇటు ఏమాయికుంట గ్రామ పరిధిలోకి రావడం లేదు. ఎక్కడకు వెళ్లిన తమకు ఇబ్బందిగా మారుతుంది. డెత్​ సర్టిఫికేట్​ క్లైమ్​ చేసుకోవాలనుకున్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. తమ గ్రామాన్ని ఏదో ఒక పంచాయతీలో విలీనం చేయాలి. లేకపోతే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ చేయాలని కోరుతున్నాము. మా దగ్గర 600 మంది జనాభా, 400 మంది ఓటర్లు ఉన్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది." - స్థానికులు

400 జనాభా కలిగి ఉన్నా, కనీస వసతులకు నోచుకోవటం లేదు. ప్రజల దయనీయ పరిస్థితిని చూసి గతంలో ఓ కలెక్టర్​ గ్రామానికి పంచాయతీ ప్రస్తావన లేకుండానే విద్యుత్​ సౌకర్యం కల్పించారు. ఉట్నూర్​ ఐటీడీఏ రెండు బోర్లును వేయించింది. అక్కడ ఓ అంగన్​వాడీ భవనం తప్పితే ఊర్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు లేవు. నిరుపేదలకు పక్కా ఇళ్ల ఊసే లేదు. చివరికి జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"రెవెన్యూ రికార్డుల ప్రకారం సుందర్​నగర్​ గ్రామం ఏమాయికుంట పరిధిలో ఉంది. ఆధార్​ కార్డు వంటి ధ్రుపత్రాల్లో మాత్రం ఇంద్రవెల్లిలో ఉన్నారు. వీళ్ల ఆధార్​ కార్డు అప్​డేట్​ కావాలి. ఇంటి నెంబరు ఉండాలి. వీళ్లకు ల్యాండ్​ ఇచ్చిన ఏవిడెన్స్​ ఉంటే ఏమాయికుంటలో ఆధార్​ కార్డును తీసుకుంటారు. ఓటరుగా మాత్రం ఎక్కడి నుంచైనా ఉండవచ్చు. కానీ వాటికి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. పంచాయతీ గుర్తింపు అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సిన ప్రక్రియ." - భాస్కర్​, ఎంపీడీవో , ఇంద్రవెల్లి

ఆ ఊళ్లో 70 ఏళ్లుగా దీపావళి జరుపుకోరు - ఎందుకో తెలుసా?

నాగరాజు.. నాగరాణి.. నాగజ్యోతి.. నాగచైతన్య - ఆ ఊళ్లో అందరి పేర్లు 'నా'తోనే మొదలు - SPECIAL STORY ON NAGULAPETA VILLAGE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.