Judge Who Showed Humanity in His Verdict :నిందితుడిపై నేరం రుజువు కాలేదని కేసు కొట్టేసినా బాధిత బాలికకు పరిహారం కింద 3 లక్షల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇప్పించాలని తీర్పు చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు న్యాయమూర్తి మనీషా శ్రవన్ ఉన్నమ్. ఈ ఘటన గత బుధవారం వరంగల్ జిల్లాలోని పోక్సో న్యాయస్థానంలో జరిగింది.
సాక్ష్యం లేక కొట్టేసిన కేసులో బాధితురాలికి పరిహారం :శుక్రవారం ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులు లేని ఓ 17 ఏళ్ల బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఓ ఫ్రెండ్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నాను.. వివాహం చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయింది. ఈ విషయాన్ని అతనికి చెప్పగా తనకెలాంటి సంబంధం లేదని ఆ యువకుడు బుకాయించాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించగా వారు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.