తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమ పథకాలకు నిధుల వేట - ఎల్‌ఆర్‌ఎస్‌, భూముల రిజిస్ట్రేసన్‌ విలువల పెంపు అంశాలపై ముందుకు - Telangana Govt Revenue Increased - TELANGANA GOVT REVENUE INCREASED

Telangana Govt Focus On Revenue 2024 : రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఎల్​ఆర్ఎస్ అమలు భూముల రిజిస్ట్రేసన్‌ విలువల పెంపు రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులు తీసుకురావడం, అక్రమ మద్యం, గుడుంబా నిరోధంతో అదనంగా పదివేల కోట్లు వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విమర్శలకు తావు లేకుండా ఆ మూడింటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Telangana Govt Focus On Revenue
Telangana Govt Focus On Revenue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 10:10 AM IST

Telangana Govt Focus On Revenue :కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం సహా పొదుపునకు అధిక ప్రాధాన్యమిస్తోంది.ప్రజలపై అదనపు భారం లేకుండానే అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను ప్రస్తుత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచడం లే అవుట్‌ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ అమలు స్టాంపుల రిజిస్ట్రేషన్‌ చట్టంలోని షెడ్యూల్‌కి మార్పులు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ సవరణకి ఉన్న అవకాశాలపై అన్వేషణ చేస్తోంది.

అక్రమ మద్యం, గుడుంబాపై కఠిన చర్యలు :అక్రమ మద్యం, గుడుంబా నిరోధానికి కఠిన చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఆ చర్యలతో ప్రభుత్వ ఖజానాకి రూ.10 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలులో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలపై కనీసం 30 శాతం నుంచి అధికంగా 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అంచనా వేస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 14 వేల 295.56 కోట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఆదాయం వచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్‌ ధరలపై సగటున 30శాతం పెరిగినా రూ.4వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతం ఉన్న స్టాంపు డ్యూటీ పెంచడం ద్వారా దాదాపు వెయ్యి కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భూముల రిజిస్ట్రేసన్‌ విలువల పెంపు :ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ అమలుతో మరో రూ. 4 నుంచి రూ. 5 వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 23.70 లక్షల మంది ధరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వాటిని రెగ్యులైజేషన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.

ఎక్సైజ్‌ శాఖ నుంచి ఏడాది రూ.36వేల కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. అది మరింత పెరిగేందుకు అవకాశం ఉందని సర్కార్‌ గుర్తించింది. మద్యం ధరలు పెంచకుండానే బయటి రాష్ట్రాల నుంచి, స్థానికంగా మద్యం తయారీ కంపెనీల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను పూర్తి స్థాయిలో కట్టడిచేయడం గుడుంబా తయారీ సరఫరా, విక్రయాలు నిలువరిస్తే ఆదాయం పెరుగుతుందని యోచిస్తున్నారు. దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆబ్కారీ ఆదాయంపై సర్కార్ స్పెషల్ ఫోకస్ - అక్రమ మద్యంపై ఉక్కుపాదం - TG GOVT FOCUS ON EXCISE REVENUE

కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా - మూడు నెలల్లో పెరిగిన రూ.3వేల కోట్ల ఆదాయం - Telangana Tax Revenue Increased

ABOUT THE AUTHOR

...view details