Mahalakshmi Scheme in Joint Nalgonda District :ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ హామీని హస్తం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ పథకానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనూహ్యస్పందన లభిస్తోంది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఖాళీ లేకుండా వెళ్తున్నాయి.
Mahalakshmi Scheme in Telangana : ఈ పథకం అమల్లోకి రాక ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజియన్ పరిధిలోని 7 డిపోల్లో ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షలకు చేరింది. ఇందులో 2 లక్షల మంది మహిళలే ఉండడం గమనార్హం. నల్లగొండ రీజియన్‌లో 7 డిపోలకుగానూ 637 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ 383, అద్దె బస్సులు 254 ఉన్నాయి.
మహాలక్ష్మి పథకం బాగుందన్న మహిళలు : మహాలక్ష్మి పథకంతో గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగడంతో బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. బస్సు ఛార్జీలు మిగలడంతో వేరే అవసరాలకు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. మరోవైపు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాక బస్సలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పీక్ అవర్స్‌లో పురుషులు ప్రయాణించటం కష్టంగా మారింది. బస్సుల సంఖ్య పెంచితే చాలా బాగుంటుందని వారు పేర్కొంటున్నారు.
"ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. మా లాంటి మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషం. ఎక్కడికైనా జీరో టికెట్ ఇస్తున్నారు.తమకు ఛార్జీలు మిగులుతున్నాయి. వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలియజేేస్తున్నాం. అలాగే రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం." - మహిళలు