తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు ముళ్ల బంధం - మాయగాళ్ల గండం - FRAUD IN THE NAME OF MARRIAGES

వివాహం పేరుతో పెరుగుతున్న భారీ మోసాలు - పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వివాహ పరిచయ వేదికలు

MARRIAGE PLATFORMS
FRAUD IN THE NAME OF MARRIAGES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 1:55 PM IST

Youth Falling Victim to Scammers : వివాహ బంధంతో ఒక్కటయ్యే ప్రయత్నంలో యువతీ, యువకులు మోసగాళ్ల బారిన పడుతున్నారు. కొన్ని వివాహ పరిచయ వేదికలను అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు నకిలీ ఫొటోలు, అడ్రస్​లోతో అమాయక వ్యక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. మరోవైపు కొందరు కిలేడీలు తామే కాబోయే పెళ్లికూతుళ్లమంటూ అబ్బాయిలకు దగ్గరై భారీగా సోమ్ము దండుకుంటున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే పెళ్లి పేరిట తమనే మోసగించారంటూ పోలీస్​ స్టేషన్లలో రివర్స్​ కంప్లైంట్​ ఇస్తున్నారు.

ఇది కేవలం ఒక్క ఘటనే : మణికొండకు చెందిన ఓ యువతి వివాహం చేసుకున్న ఏడాదికే భర్త నుంచి విడిపోయారు. మరో జోడుకోసం వెతికే క్రమంలో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఓ యువకుడి ప్రొఫైల్‌ చూసి వివరాలు సేకరించారు. ఇద్దరి మధ్య కొద్దిరోజులు వాట్సాప్​లో సంభాషణలు జరిగాక తన బ్యాంకు ఖాతా లావాదేవీలు నిలిపివేశారని ఆ యువతితో చెప్పాడు. తదితర కారణాలు చూపుతూ 3 నెలల వ్యవధిలో రూ.4లక్షల 50 కాజేశాడు. ఆ తరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. అతడిది పశ్చిమగోదావరి జిల్లా చెందిన వ్యక్తిగా తేలిసింది.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హైదరాబాద్​ నగర పరిధిలో 50కు పైగా కేసులు పెళ్లిపేరిట మోసపోయినట్లు రావడం గమనార్హం. ఎంత పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుంటున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా అమ్మాయి, అబ్బాయిలను చూడకుండా నిర్ణయం తీసుకోవద్దని, నగదు ముందుగానే కావాలంటున్నారంటే మోసపోతున్నట్లు గుర్తించాలని నగర పోలీసులు సూచిస్తున్నారు. సోషల్​ మీడియాలో, ఇతర వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో మోసాలకు పాల్పడే ముఠాలు రెండురకాలుగా మోసం చేస్తున్నారు. కొందరు విదేశాల్లో ఉంటున్నట్లు ఎన్నారైలుగా పరిచయం చేసుకుంటారు. మరోతరహా కేటుగాళ్లు ఏపీ, తెలంగాణల్లోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారీగా పరిచయం చేసుకుని ఈ తరహా పనులకు పాల్పడుతున్నారు.

రకరకాలుగా మోసాలు

  1. విజయవాడకు చెందిన ఓ యువతితో బోడుప్పల్‌కు చెందిన ప్రయివేటు ఉద్యోగికి పెళ్లి కుదిరింది. అతడికి 40 ఏళ్ల వయసు దాటడంతో అమ్మాయి కుటుంబానికి ఎదురు కట్నం ఇచ్చి మరీ ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి కనీసం 20 రోజులు దాటకుండానే తన భార్య పుట్టింటికి చేరడంతో షాక్​ అయ్యాడు. ఆమెను తీసుకొచ్చేందుకు అత్తారింటికెళ్లాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు తమ కూతురు కాపురానికి రాదని తేల్చిచెప్పారు. వేధించావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఇవేమీ లేకుండా ఉండాలంటే రూ.5లక్షలు ఇవ్వాలంటూ బేదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితుడు ఆ యువతి గురించి పూర్తిగా ఆరాతీయటంతో అసలు విషయం బయటపడింది. ఇదే తరహాలో ఆ యువతి కుటుంబసభ్యులంతా కలిసి ఇదివరకే నలుగురిని మోసగించినట్టు తెలుసుకున్నాడు.
  2. వధూవరులిద్దరూ ఒకరికొకరు నచ్చుకున్నారు. ఇంకేముంది పెళ్లి కుదిరిందనే సమయంలో నిజస్వరూపం ప్రదర్శిస్తారు. అటువైపు ఉన్నది అబ్బాయిలైతే లాంఛనాలు ముందుగానే ఇస్తే కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తామని చెబుతారు. తమకు అందాల్సిన నగదు చేతికి రాలేదంటూ చిన్న డ్రామా క్రియేట్​ చేస్తారు. ఎలాగూ కాబోయే అల్లుడే కదా! అని అడిగినంత నగదు ఇవ్వగానే మరుసటిరోజు నుంచి రెస్పాన్స్​ ఇవ్వరు.
  3. కొందరు వివాహ పరిచయవేదికల నిర్వాహకులు అమాయకపు యువతులకు కమీషన్‌ ఆశచూపి వధువుగా పరిచయం చేస్తారు. హోటళ్లు, రెస్టారెంట్​, కాఫీషాపుల్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేసి అబ్బాయిలకు పరిచయం చేస్తారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త పెరిగాక షికార్లు, బర్త్​డే సెలబ్రేషన్స్​ అంటూ అతడి నుంచి అందినంత దోచుకున్నాక అమ్మాయికి అతడి ప్రవర్తన నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్​ చేస్తారు.
  4. హైదరాబాద్​లోని సంతోష్‌నగర్‌కు చెందిన వ్యక్తికి వివాహ పరిచయ వేదికపై ఓ మహిళ పరిచయమైంది. ఇద్దరి మధ్య క్లోజ్​నెస్​ పెరిగాక ఆమె వివిధ రకాల కారణాలు చెప్పి అతడి నుంచి ఏకంగా రూ.5లక్షలు స్వాహా చేసింది. పెళ్లి అనగానే పెద్ద గొడవ చేయటంతో ఆందోళనకు గురైన బాధితుడి తల్లి బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై మరణించింది.

పైన దుబాయ్ కరెన్సీ, లోన తెల్ల కాగితాలు - మార్చిపెట్టాలని మోసం

'మీకు ఇల్లు వచ్చింది - ఇదిగో పత్రాలు తీసుకోండి' - హైదరాబాద్​లో 'డబుల్​' మోసం

ABOUT THE AUTHOR

...view details