తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద బాధితులకు విరాళాలు వెల్లువ - జీఎంఆర్ సంస్థ​ భారీ సాయం - Floods Donors In Telangana - FLOODS DONORS IN TELANGANA

Floods Donors In Telangana : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, ప్రాజెక్టులు, నదులు పొంగి వరద ప్రభావానికి లక్షలాది మంది సర్వస్వం కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి చెల్లాచెదురైన బాధితులకి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలు చేయూత అందిస్తున్నారు.

Huge Donation To Telangana CMRF
Floods Donors In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 7:39 AM IST

Updated : Sep 7, 2024, 8:35 AM IST

Flood Relief Fund For Telangana: రాష్ట్రంలో వరద బాధితులకి ఆపన్నహస్తంఅందించేందుకు దాతలుముందుకొస్తున్నారు. జలవిలయంతో అల్లాడిన ప్రజలకు పలు సంస్థలు మానవత్వంతో ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. వరద బాధితులకు సహాయం కోసం సీఎం సహాయనిధికి తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళాల చెక్కులు అందజేశారు.

Huge Donation To Telangana CMRF :జీఎంఆర్ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెట్‌ ప్రతినిధులు రెండున్నర కోట్ల రూపాయల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు అందించారు. అపోలో ఆస్పత్రులు, శ్రీ చైతన్య విద్యాసంస్థలు, కెమిలాయిడ్స్, విర్కో ఫార్మా సంస్థలు రూ. 1 కోటి చొప్పున విరాళాలను అందించాయి. ఆర్.వి.ఆర్. ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున ఆ సంస్ఖ ఎండీ రాయల రఘు రూ. 1 కోటి విరాళం ఇచ్చారు.

భారత్‌ బయోటెక్‌ విరాళం :భారత్‌ బయోటెక్‌ వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేసింది. ఇప్పటికే ఏపీకి భారత్‌ బయోటెక్‌ రూ.1 కోటి విరాళం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజలపై వరద ప్రభావం చాలా బాధ కలిగించిందని తాము అందించే సాయం బాధితులకు ఒక చిన్న సాయంగా భావిస్తున్నామని భారత్‌ బయోటెక్ తెలిపింది.

రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్​ సాయం : వరదలతో కట్టుబట్టలతో బయటపడిన బాధిత ప్రజలకు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రూ.2కోట్లు విరాళంగా ఇచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డికి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య చెక్కు అందించారు. మిగతా కార్పొరేషన్లు విరాళాలు అందివ్వడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆపన్నులకు చేయూత : బాధితులను ఆదుకోవడానికి ప్రజాప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి నెల వేతనం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ రూ.25లక్షల చొప్పున రూ.50 లక్షల సాయాన్ని ప్రకటించింది. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి కోరుకున్నారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమ తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సానికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు తమ విరాళాలను రెండు తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్నాయి.

పాలేరులో వరద బాధితులకు ఈనాడు ఆపన్నహస్తం - Eenadu Donations for Flood Victims

వరద బాధితుల కోసం టాలీవుడ్‌ కీలక నిర్ణయం - Tollywood Producers

Last Updated : Sep 7, 2024, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details