Huge Amount Of Cash Seized in Hyderabad :తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు చేపడుతూ అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు హైదరాబాద్‌లోని దారుస్సలాం ఔట్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. మంగళ్‌హాట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్త రవిచంద్ర, సురేశ్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు చెప్పారు.
ఖమ్మంలో అక్రమంగా తరలిస్తున్న 7లక్షల నగదు పట్టివేత - Cash SEIZED IN KHAMMAM
Cash Seized in Telangana :మరోవైపు మహబూబాబాద్ జిల్లా ములుకలపల్లి చెక్ పోస్ట్ వద్ద వేర్వేరు సోదాల్లో రూ. 8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా ఓ రూ.4.50 లక్షల సొత్తు పట్టుబడగా, మరో వాహనంలో రూ.3.50 లక్షల సొమ్మును పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.6.40 లక్షలు పట్టుబడ్డాయి.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అకౌంట్లపై పోలీసులు పోలీసులు నిఘా ఉంచారు. రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలన్న సీఈసీ సూచనతో చర్యలు చేపట్టారు.
Election Code Inspection in Telangana 2024 :మరోవైపురాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నియామవళి అమలు తనిఖీల్లో భాగంగా రూ.38.12 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో రూ.9,01,67,748 నగదు, రూ.3,34,10,277 విలువైన మద్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. రూ. 8.14 కోట్ల విలువైన 28 కిలోల బంగారం, వెండి ఆభరణాలు జప్తు చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.13.66 కోట్ల విలువైన 410 కిలోల డ్రగ్స్ పట్టుకున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్లో పోలీసుల తనిఖీలు - రూ.6.65 కోట్లు స్వాధీనం
తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం