తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరికీ నచ్చే టాంగీ చికెన్ - పంజాబ్ లెమన్ చికెన్! - How to make punjabi lemon chicken

tangy kadhai chicken and punjabi lemon chicken : చికెన్ లో వెరైటీ రెసిపీస్​ను ఆస్వాదించే వాళ్లకోసం మరో రెండు కొత్త రకం వంటకాలను పరిచయం చేస్తున్నాం. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఈ చికెన్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

tangy kadhai chicken
punjabi lemon chicken

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 3:37 PM IST

tangy kadhai chicken and punjabi lemon chicken : నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ కర్రీ అంటే ఎగిరి గంతేస్తారు. కుకింగ్ సరిగ్గా కుదరాలేగానీ అద్భుతంగా ఆస్వాదిస్తారు. అయితే.. రొటీన్ రెసిపీ కాకుండా అప్పుడప్పుడూ వెరైటీ ప్లాన్ చేయాలి. అందుకోసమే ఇవాళ రెండు స్పెషల్ రెసిపీస్ తెచ్చేశాం. అందులో ఒకటి టాంగీ కడాయి చికెన్, మరొకటి పంజాబ్ లెమన్ చికెన్! మరి.. వాటిని ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

టాంగీ కడాయి చికెన్ కోసం కావాల్సిన పదార్థాలు :

చికెన్ - అరకేజీ (ముక్కలుగా పెద్ద కట్‌ చేయాలి)

ఆయిల్ - 3 స్పూన్లు

పసుపు - హాఫ్ స్పూన్

చింతపండు - 2 స్పూన్లు

ధనియాలు - స్పూన్

కారం - స్పూన్ (ఘాటుగా కావాలంటే మీకు నచ్చినంత)

సోంపు - స్పూన్

మిరియాలు - స్పూన్

దాల్చిన చెక్క - చిన్న ముక్క

నిమ్మరసం - అర స్పూన్

ఉప్పు - సరిపడా

బెల్లం - 1 స్పూన్‌

తరిన ఉల్లి - 1 కప్పు

పచ్చిమిర్చి - రెండు కాయలు

కొత్తిమీర - తగినంత

ఎలా తయారు చేయాలి:

ముందుగా సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు దోరగా వేయించి, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత.. చికెన్‌లో ఉప్పు, కారం, చింతపండు గుజ్జు, పసుపు, బెల్లం, నిమ్మరసం వేసి కలపాలి. మిక్స్ చేసిన తర్వాత అరగంటపాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించాలి. వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్‌ వేయాలి. కొంచెం మగ్గిన తర్వాత.. కప్పు నీళ్లు, మసాలా పొడి వేసి ఉడకనివ్వాలి. సూప్ చిక్కబడిన తర్వాత ఉడికిందని నిర్ధారించుకొని దించేయాలి. దానిపై కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని లాగిస్తే.. అద్దిరిపోతుంది.

మర్గ్​ మలై టిక్కా - సూపర్ టేస్టీ - చేయడం కూడా ఈజీనే!

పంజాబ్ లెమన్ చికెన్ కోసం కావలసిన పదార్థాలు :

చికెన్‌ - అర కేజీ

ఆయిల్ - 3 స్పూన్లు,

తరిగిన ఉల్లి - 1 కప్పున్నర

తరిగిన వెల్లిపాయలు - 2 స్పూన్లు

తరిగిన అల్ల - 1 స్పూన్,

జీలకర్ర - 2 స్పూన్లు,

ధనియాల పొడి - 1 స్పూన్

పసుపు - 1/2 స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం - 1 స్పూన్‌

నిమ్మరసం - 2 స్పూన్లు

కొత్తిమీర - కావాల్సినంత

ఎలా తయారు చేయాలి :

స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగుతోపాటు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు చికెన్‌ వేయాలి. కడాయిలోని మసాలా మొత్తం చికెన్​కు పట్టేలా కలపాలి. ఇలా కాసేపు ఉడికించిన తర్వాత.. నిమ్మరసం వేయాలి. లెమన్ పులుపుని బ్యాలెన్స్‌ చేయడం కోసం బెల్లం పొడి వేయాలి. ఇవన్నీ వేసి కలపాలి. ఆ తర్వాత ఉండికిందని నిర్ధారించుకున్న తర్వాత దించేయడమే. దానిపై కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే.. అద్దిరిపోయే పంజాబ్‌ లెమన్‌ చికెన్​ను ఆస్వాదించొచ్చు.

చికెన్ మహారాజ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే

ABOUT THE AUTHOR

...view details