తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లోనే ఉంటూ కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టొచ్చు - ఈ టిప్స్​ పాటిస్తేనే! - How to Check Ghee Quality in Telugu

How to Check Ghee Purity in Telugu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒకే సందేహం కలుగుతుంది. అసలు స్వచ్ఛమైన నెయ్యి ఎలా ఉంటుంది కల్తీ నెయ్యి ఎలా ఉంటుంది. మనం బయట కొనే నెయ్యి స్వచ్ఛమైనదేనా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు మంచి నెయ్యిని ఎలా కనుగొనాలో ఈ స్టోరీలో చదివేయండి.

How to Check Ghee Quality in Telugu
How to Check Ghee Quality in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 3:29 PM IST

Updated : Sep 23, 2024, 3:42 PM IST

How to Check Ghee Quality in Telugu :తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ సందేహం కలిగిస్తోంది. రోజుకి రెండుమూడు స్పూన్ల నెయ్యి తింటే రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, పిల్లలకీ, వృద్ధులకీ నెయ్యి మంచిదనీ, నేతితో వండిన అన్నం పిల్లలకు మేలనీ అంటారు. మరి అలాంటి నెయ్యిను బయటకు దుకాణాల్లో కొనాలంటే కాస్త డౌట్​ పడాల్సిందే. అయితే నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలా అనేది చాలా మందికి తెలియదు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా. ఇప్పడు తెలుసుకుందాం.

Ghee Purity Test At Home:దేశీ నెయ్యిలో పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలూ చాలా ఉంటాయి. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ నెయ్యి స్వచ్ఛమైందో కాదో తెలుసుకునేదెలా అంటే..

  • నీళ్లతో పరీక్ష:గ్లాసు నీటిలో చెంచా నెయ్యి వేయండి. నెయ్యి నీళ్లపై తేలితే అది స్వచ్ఛమైంది. అదే అడుగుకు చేరితే కల్తీ అని నిర్ధారణ చేసుకోవచ్చు.
  • వేడి చేయడం:పాన్‌లో రెండు మూడు చెంచాల నెయ్యి వేసి కొంచెెంసేపు వేడి చేయాలి. ఆ తర్వాత ఓ రోజంతా దాన్ని అలా వదిలేయాలి. తరువాత రోజు అది చిన్న చిన్న రేణువుల్లా మారి సువాసనలు వెదజల్లుతుంటే స్వచ్ఛమైందేనని ముద్దలానే ఉంటే కల్తీ అని తెలుసుకోవచ్చు.
  • ఉప్పుతో:2 చెంచాల నెయ్యిలో అర చెంచా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత నెయ్యి రంగు మారితే అది కల్తీ అనే అర్థం.

ఇలా కూడా కనిపెట్టొచ్చు..

  • కాస్త నెయ్యిని అరచేతిలో వేసుకోండి. కాసేపటికి అది కరిగితే నాణ్యమైందని అర్థం.
  • చెంచా నెయ్యిని పాన్‌లో వేసి వేడి చేయాలి. వెంటనే కరిగి ముదురు చాక్లెట్‌ రంగులోకి మారితే అది స్వచ్ఛమైంది. కరగడానికి ఎక్కువ సమయం పట్టి, లేత పసుపు రంగులోకి మారితే మాత్రం తేడా ఉన్నట్టు.

ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది:ఆవు, గేదె, మేక పాల నుంచి నెయ్యి తీసినప్పటికీ ఆవు నెయ్యి శ్రేష్ఠమైనది అంటోంది ఆయుర్వేదం. ఆవునెయ్యిలో బీటా-కెరోటిన్‌ ఎక్కువగా ఉండటంతో పసుపు రంగులో ఉంటుంది. గేదె నెయ్యి తెల్లగా రుచిగా ఉంటుంది. కానీ ఆవునెయ్యిలో కొవ్వు శాతం తక్కువ కావడంతోపాటు, జీవక్రియను పెంచి బరువును తగ్గించే కాంజ్యుగేటెడ్‌ లినోలియాక్‌ ఆమ్ల శాతం ఎక్కువ. అయితే ఈ ఆమ్లం గడ్డి మేసే పశువుల పాలల్లోనే అధికంగా ఉంటుందట. అందుకే పశువులకు వేసే మేతను బట్టి గ్రాస్‌-ఫెడ్‌, ఎ2 ఆర్గానిక్‌ గ్రాస్‌ ఫెడ్‌, గ్రెయిన్‌-ఫెడ్‌, గార్లిక్‌గ్రాస్‌-ఫెడ్‌.. ఇలా రకరకాల పేర్లతో సేంద్రియ మంత్రాన్ని చేర్చి మరీ నెయ్యిని విక్రయిస్తున్నాయి కంపెనీలు.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది: గిర్‌, సాహివాల్‌, వేచూరు వంటి దేశవాళీ ఆవుల్లో ఎ2 రకం బీటా కేసిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. అదే హైబ్రిడ్‌ జాతి ఆవుల్లో ఎ2 కన్నా ఎ1 రకం బీటా కేసిన్‌ ఎక్కువ. ఎ1తో పోలిస్తే ఎ2 మంచిదట. దీని ధర కూడా ఎక్కువే. కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కానీ దానివల్ల బరువు పెరుగుతారు. ఆవునెయ్యిని అన్ని వయసులవాళ్లూ తినొచ్చు. కానీ గేదె నెయ్యి ఆరోగ్యంగా చురుకుగా ఉన్నవాళ్లకే మంచిదట. పిల్లలకు కూడా ఆవు నెయ్యి పెట్టడంవల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది అంటారు ఆయుర్వేద వైద్యులు.

తిరుమల లడ్డూ విషయంలో డౌట్ వద్దు - అంతకంటే ముందే నెయ్యి మార్చేశాం : టీటీడీ - TTD ON TIRUMALA LADDU controversy

శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమల లడ్డూకు మళ్లీ నందిని నెయ్యి - కిలో ఎంతో తెలుసా? - Nandini Ghee to Tirupati Laddu

Last Updated : Sep 23, 2024, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details