Diwali Safety Precautions :దీపావళి వెలుగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే ఆనందాల వేడుక. అందరూ బాణసంచా కాల్చి హ్యాపీగా జరుపుకొంటారు. చిన్నారులకు పక్కనే ఉండి కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు లాంటి వాటిని కాల్చడంలో పేరెంట్స్, ఇంట్లో పెద్దవాళ్లు సహాయం చేస్తుంటారు. తగు జాగ్రత్తలు చెబుతూ హెచ్చరిస్తూ వారి ఆనందాన్ని కుటుంబ సభ్యులు ఆస్వాదిస్తుంటారు. ఇక యువతీయువకులు అయితే లక్ష్మీ బాంబులు, పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చుతూ పోటాపోటీగా సంబురాలు జరుపుకుంటారు. ఈ క్రమంలో టపాసులు పేల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.
దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. చిన్నాపెద్ద అంతా కలిసి బాణాసంచా, మతాబులు కాల్చుతూ తమ ఆనందాన్ని పొందుతారు. ఈ క్రమంలో దీపాలంకరణలతో నిర్వహించుకునే దివాలి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, విషాదాన్ని దరిదాపులకు రానివ్వొద్దని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. బాణాసంచా విక్రయించే షాపు యజమానులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. దుకాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అప్రమత్తతోనే ఆనంద దీపావళిని జరుపుకోవాలని, అందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అటు బాణాసంచా విక్రేతలకు, ఇటు ప్రజలకు వివరించారు.
అనుమతులుంటేనే అమ్మకాలు :
✸ బాణాసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా షాపుల్లో ఇసుక, నీటి బకెట్లతో పాటు అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉండాలి.
✸ అన్ని అనుమతులు తీసుకోవాలి, అక్రమంగా మందుగుండ నిల్వచేస్తే కఠినచర్యలు తప్పవు
✸ బాణసంచా నిల్వ చేసే ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.
✸ అగ్నిమాపక సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
✸ బాణసంచా నిల్వ చేసే ప్రదేశాలకు దూరంగా నివాస ప్రాంతాలు ఉండేలా చూసుకోవాలి.
టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి :
✸ పిల్లలు పటాకాలు వేసేటప్పుడు వారిని ఎప్పుడూ ఒంటరిగా వదలవద్దు.
✸ ప్రమాదకరమైన బాణసంచా జోలికి వెళ్లక పోవటం ఉత్తమం.
✸ శానిటైజర్ పూసుకొన్న చేతులతో టపాసులు ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్చొద్దు.