Housewife Got 5 Government Jobs in Warangal : చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది ఈ మహిళ కల. కాని కుటుబ పరిస్థితుల నేపథ్యంలో తన కల నేరవేరకుండానే వివాహం జరిగింది. అయినా తన కల నెరవేర్చుకోవడానికి వివాహం అడ్డుగా మారకూడదు అని నిర్ణయించుకుంది. కుటుంబ వ్యవహరాలు చూసుకుంటూనే ఖాళీ సమయాలలో తన సమయాన్ని చదువుకు కేటాయించేది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైన చదువును మాత్రం దూరం పెట్టకుండా తన లక్ష్యాన్ని ముద్దాడింది.
ఖమ్మం బిడ్డ అదరగొట్టే - ఆర్థిక అవరోధాలున్నా ఆరేళ్లు సాధన - ఒకేసారి 4 సర్కారీ కొలువులు
Warangal Woman Five Govt Jobs : వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలానికి చెందిన హిమబిందు విద్యాభ్యాసం వరంగల్‌లోనే పూర్తి చేసింది. ప్రభుత్వ కొలువు కోసం దశాబ్ద కాలంగా నిరంతర శ్రమ చేసింది. 2023లో గురుకుల బోర్డు ప్రకటించిన ఉద్యోగాల్లో జూనియర్ కళాశాల లెక్చరర్, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ఫ్రోఫెసర్, లైబ్రేరీయన్ ఉద్యోగాలు సాధించింది. అంతేకాకుండా పాలిటెక్నిక్ జేఎల్, ఇంటర్మీడియెట్ జేఎల్ పోస్టులను సైతం కైవసం చేసుకొని ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకుంది ఈ మహిళ.
కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ : హిమబిందు లైబ్రరీ సైన్స్‌పై ఆసక్తితో అంబేడ్కర్ వర్శిటీలో మరోసారి పీజీ చేసింది. అనేక పోటీ పరీక్షలు రాసిన ఈ మహిళకి అతి తక్కువ పాయింట్లలో ఉద్యోగాలు చేజారాయి. అయినా ఏనాడు కృంగిపోకుండా ఆత్మ విశ్వాసంతో నిరంతర సాధన చేసి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఇద్దరు పిల్లలున్నా నువ్వు ఎలా ఉద్యోగం సాధిస్తావన్న వారితోనే శభాష్ అనిపించుకుంది.
పాలిటెక్నిక్ లైబ్రరీ సైన్స్ ఉద్యోగాల్లో మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంది హిమబిందు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఓకే సబ్జెక్టును ఎంచుకొని ప్రిపేర్ అవ్వడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని చెప్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబ సహకారంతోనే తన లక్ష్యాన్ని చేరుకున్నానని అంటోంది ఈ ఓరుగల్లు ఆణిముత్యం.