Home Minister Anitha Comments on Ayyanna Patrudu :అక్రమ కేసులు పెట్టి బెదిరించినా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచిన తాతాజీ అయ్యన్నపాత్రుడు అని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. వైఎస్సార్సీపీకి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా లేదని మండిపడ్డారు. ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిగేలా సభ హుందాతనాన్ని కాపాడతామన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు అయ్యన్న మార్గదర్శకమని వారి సేవలకు ధన్యవాదాలు తెలిపారు.
'40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేని వ్యక్తి అయ్యన్న' - Home Minister Anitha about Ayyanna
Home Minister Anitha Comments on Ayyanna Patrudu : అక్రమ కేసులు పెట్టి బెదిరించినా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచిన తాతాజీ అయ్యన్నపాత్రుడు అని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. వైఎస్సార్సీపీకి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా లేదని మండిపడ్డారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 1:46 PM IST
'సామాన్యుడికి అతిదగ్గరగా నిలిచిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు. రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లు రాష్ట్రం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది అయినా ఆయకు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక మచ్చ కూడా లేదు. గత ప్రభుత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించి మీ కుటుంబంలోని వ్యక్తులను బెదిరించినా మీరెప్పుడు వణకలేదు. సంప్రదాయాలకు విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీని విడువలేదు.'- హోం మంత్రి అనిత
Home Minister Anitha about Ayyanna Patrudu :ఐదుకోట్లమందిలో 175 మందికే అధ్యక్షా అనే పిలుపు అవకాశం వస్తుందని ఆ అవకాశం అయ్యన్ను ఏరికోరి వరించడం చాలా గర్వంగా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు సభ హుందాతనాన్ని కాపాడతారని నమ్ముతున్నానని అనిత అన్నారు. అతి దగ్గరగా మీ కుటుంబసభ్యురాలిగా మిమ్మల్ని ఎప్పుడూ చూశా గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అనేక కామెంట్లు పెట్టి వేధించారు, వైఎస్సార్సీపీ హయాంలోశాసనసభ సమావేశాలను పిల్లలతో కలిసి చూసే వీల్లేని భాష వాడారు అనిత ధ్వజమెత్తారు.