ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలపై రాజకీయాలు చేయొద్దు - వారి రక్షణ మా బాధ్యత: మంత్రి అనిత - ANITA VISIT JUVENILE HOME

ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనాన్ని సందర్శించిన మంత్రి అనిత - బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే నివేదిక కోరిన మంత్రి

Anita_visit_juvenile_home
Anita_visit_juvenile_home (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 5:07 PM IST

Home Minister Anita Visit Visakha Juvenile Home:ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదన్ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. చిన్న పిల్లలపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. విశాఖలోని జువైనల్‌ హోమ్‌ను మంత్రి అనిత సందర్శించారు. పలు కేసుల్లో చిక్కుకుని కుటుంబాలకు దూరంగా ఉంటున్న బాలికలపై లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

వసతి గృహం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణల నేపథ్యంలో వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని అనిత వెల్లడించారు. బాలికలు వసతి గృహం గోడదూకి బయటకు వచ్చిన నేపథ్యంలో పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశామని చెప్పారు. బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

పిల్లలపై రాజకీయాలు చేయొద్దు - వారి రక్షణ మా బాధ్యత: మంత్రి అనిత (ETV Bharat)

'ప్రతి మాట గుర్తుంది-అస్సలు వదిలిపెట్టం' - విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్

పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే:జువైనల్‌ హోమ్‌లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి అనిత తెలిపారు. వాళ్లు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదని దీన్ని ఎవరో గుర్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి మండిపడ్డారు.

తమ బాధ్యత తమకు తెలుసని, ఏ సమస్య అయినా పరిష్కారం తామే చూస్తామని మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య తిరిగి రాకూడదని ఈ రోజు బాలికల సదన్‌ను సందర్శించినట్లు వివరించారు. దీనిపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు ఆ పార్టీ నేతలు అబద్ధాలతో గడిపేశారని ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచేశారని మంత్రి అనిత విమర్శించారు.

'ఇంత నిర్లక్ష్యమా - కూలీలు చనిపోయి ఉంటే ఏం చేసేవారు?'

రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details