Holydays For Banks Stock Exchange : ఎన్నో ఆశలు, లక్ష్యాలతో కొత్త ఏడాదిలో అడుగు పెట్టేశాం. నూతన ఏడాదిలో ఎప్పటికప్పుడు మారే ఆర్థిక అంశాలతో పాటు ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడము చాలా కీలకమైందే. అలా ఈ సంవత్సరం బ్యాంకు సెలవులు, స్టాక్ మార్కెట్లు పనిచేయని తేదీలు, ఐటీఆర్‌కు సంబంధించి డెడ్‌లైన్స్ తెలుసుకుందాం
బ్యాంక్ సెలవులు
- జనవరి 14 (మంగళవారం) - సంక్రాంతి
- ఫిబ్రవరి 26 (బుధవారం) - మహా శివరాత్రి
- మార్చి 14 (శుక్రవారం) - హోలీ
- మార్చి 31 (సోమవారం)- రంజాన్
- ఏప్రిల్ 01 (మంగళవారం) - ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
- ఏప్రిల్ 05 (శనివారం)- జగ్జీవన్‌రాం జయంతి
- ఏప్రిల్ 14 (సోమవారం) - అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 18 (శుక్రవారం) - గుడ్‌ఫ్రైడే
- మే 01 (గురువారం) - మే డే
- జూన్ 7 (శనివారం) - బక్రీద్
- ఆగస్టు 15 (శుక్రవారం) - స్వాతంత్య్ర దినోత్సవం
- ఆగస్టు 16 (శనివారం) - శ్రీ కృష్ణాష్టమి
- ఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి
- సెప్టెంబర్ 5 (శుక్రవారం) - మిలాద్- ఉన్- నబి
- అక్టోబర్ 2 (గురువారం) - గాంధీ జయంతి
- అక్టోబర్ 20 (సోమవారం) - దీపావళి
- నవంబర్ 5 (బుధవారం) - గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 (గురువారం) - క్రిస్మస్
గమనిక : తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పని దినాలకు సంబంధించిన వివరాలను ఆర్‌బీఐవెల్లడించింది. సాధారణంగా ప్రతి నెలా రెండో, నాలుగో శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే, పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ తేదీలను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే మరి. స్థానిక పండుగల ప్రాధాన్యం కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి.
స్టాక్ మార్కెట్ల హాలిడేస్
- ఫిబ్రవరి 26 (బుధవారం) - మహాశివరాత్రి
- మార్చి 14 (శుక్రవారం) - హోలీ
- మార్చి 31 (సోమవారం) - రంజాన్
- ఏప్రిల్ 10 (గురువరాం) - శ్రీ మహవీర్ జయంతి
- ఏప్రిల్ 14 (సోమవారం) - అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 18 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
- మే 01 (గురువారం) - మహారాష్ట్ర డే
- ఆగస్టు 15 (శుక్రవారం) - స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 27 (బుధవారం) - గణేశ్ చతుర్ధశి
- అక్టోబర్ 02 (గురువారం) - గాంధీ జయంతి
- అక్టోబర్ 21 (మంగళవారం) - దీపావళి లక్షీపూజ
- అక్టోబర్ 22 (బుధవారం) - దీపావళి
- నవంబర్ 05 (బుధవారం) - గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 (గురువారం) - క్రిస్మస్