Educational Institutes in Kurnool : కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు (అక్టోబర్ 16)న అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 కు ఫోన్ చేసి తెలియచేయాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కమాండ్ కంట్రోల్ రూం : నంద్యాల జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహలకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సెలవు ప్రకటించారు. సమస్యల తెలియజేయడానికి జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వర్షాలకు ఏవైనా సమస్యలు తలెత్తితే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోన్ నెంబర్లకు 08514-293903, 08514-293908 తెలియజేయాలని చెప్పారు.
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. రానున్న 12 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు ఈదురు గాలులుంటాయని హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.