Pedda Vagu Flood Problem in Telangana : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో ఉన్న పెద్దవాగు జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న రింగ్‌బండ్‌కు 30 మీటర్ల భారీ గండి పడింది. జులై 18న భారీ వరదలకు ఈ ప్రాజెక్టు కట్ట ధ్వంసం అయింది. అలాగే స్పిల్‌వే పక్కనే 250 మీటర్ల మేర గండి పడిన సంగతి తెలిసిందే. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.3.50 కోట్లతో ప్రభుత్వం రింగ్‌బండ్ నిర్మాణాన్ని చేపట్టింది. రింగ్‌బండ్ నిర్మాణంలో పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇంతలో శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు జలాశయంలోకి భారీగా వరద చేరింది.
నూతన రింగ్‌బండ్‌కు భారీ గండి - మళ్లీ మొదటికి పెద్ద వాగు కథ - Hole for ring bund at Peddavagu
Pedda Vagu Flood Problem : అశ్వారావుపేటలోని పెద్దవాగు కథ మళ్లీ మొదటికి వచ్చింది. జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రింగ్‌బండ్‌కు 30 మీటర్ల భారీ గండి పడింది. శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ గండి ఏర్పడింది.
Pedda Vagu Flood Problem (ETV Bharat)
Published : Sep 2, 2024, 10:48 AM IST
శనివారం ఉదయం నుంచి స్పిల్‌వే గేట్ల నుంచి నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి పెరిగి రింగ్‌బండ్ పై నుంచీ కూడా ప్రవహించింది. దీంతో భారీగా గండిపడింది. రింగ్‌బండ్ వద్ద పెద్ద ఎత్తున ఇసుకబస్తాలు పేర్చిన అవీ కొట్టుకుపోయాయి. గండి కారణంగా సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.