HMDA Shiva Balakrishna Case Update :ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి శివబాలకృష్ణను 8వ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నేటితో బాలకృష్ణ ఏసీబీ కస్టడీ గడువు ముగుస్తుంది. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉండటంతో మరోసారి బాలకృష్ణను కస్టడీకి అనుమతించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు, బాలకృష్ణకు నవీన్ బినామీగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
శిలబాలకృష్ణ బినామీలపై ఫోకస్- అయిదో రోజు ముగిసిన ఏసీబీ దర్యాప్తు
HMDA Shiva Balakrishna : ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 7 రోజులుగా అతణ్ని అధికారులు విచారిస్తున్నారు. తాజా దర్యాప్తులో శివబాలకృష్ణకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులు ఉన్నాయని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 150 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 15 ఓపెన్ ప్లాట్లను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఇవే కాకుండా నల్గొండ, మహబూబ్‌నగర్, జనగామ జిల్లాల్లో శివబాలకృష్ణకు ఆస్తులున్నాయని తెలుసుకున్నట్లు వివరించారు.
HMDA Shiva Balakrishna Custody Extension :మరోవైపు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ(Shiva Balakrishna) ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియునుంది. మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టును కోరునున్నట్లు సమాచారం. గతంలో నిందితుడ్ని పది రోజులు ఏసీబీఅధికారులు కస్టడీకి అడగగా కోర్టు 8 రోజులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఆరు రోజులుగా జరిగిన విచారణలో ఆయన ఆస్తుల మీద ఆరా తీశామని అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హెచ్ఎండీఏ, రెరా ఉద్యోగులను పిలిచి విచారణ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడుతో కలిసి పనిచేసిన ఉద్యోగులకు నోటీసులిచ్చి విచారించామని అధికారులు పేర్కొన్నారు.