High Court Refused to Intervene in Municipal No Confidence :రాష్ట్రం వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చెలరేగిన అవిశ్వాసాలపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్‌ను సీజే ధర్మాసనం కొట్టేసింది. అవిశ్వాస తీర్మానంపై కలెక్టర్లు(Collectors) నోటీసులు ఇవ్వడాన్ని పలు పురపాలక సంఘాలకు చెందిన ఛైర్మన్లు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ జోక్యం చేసుకోకపోవడంతో, ధర్మాసనంలో అప్పీల్ చేశారు.
సీజే జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ నిర్వహించింది. మున్సిపల్ చట్టం-2019(Municipal Act) లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి తగిన విధానం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా స్పష్టత లేదన్నారు. నిబంధనలు రూపొందించేదాకా అవిశ్వాస తీర్మానాలు పెట్టకుండా చూడాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
నాలుగేళ్ల తర్వాత కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చని పురపాలక చట్టం చెబుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌన్సిలర్ల మెజారిటీ అభిప్రాయం మేరకు కలెక్టర్లు అవిశ్వాస తీర్మానంపై నోటీసులిచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పురపాలక ఛైర్మన్లు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
TS Sarpanches Approached to High Court :గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం(Congress Govt) ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తమ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టును కోరారు.