పుష్ప-2 చిత్రం నిలిపివేయాలంటూ పిటిషన్ - కొట్టేసిన హైకోర్టు
పుష్ప-2 నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన రాష్ట్ర హైకోర్టు
Published : Dec 3, 2024, 11:04 PM IST
High Court On PETITION ABOUT PUSHPA 2 :పుష్ప 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం(రెడ్‌శాండల్) అక్రమ రవాణా నేపథ్యంలో తీసిన ‘పుష్ప 2 చిత్రం’ విడుదలను నిలిపివేయాలంటూ శ్రీశైలం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెన్సార్ బోర్డు తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. మార్పులు సూచించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతించామని కోర్టుకు తెలిపారు. ఊహాజనిత ఆరోపణల ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కు జరిమానా(ఫైన్) విధించిన న్యాయస్థానం ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందజేయాలని ఆదేశించింది.