Heavy Rains In Telangana Coming Two Days :తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ - మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ధ నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల మధ్య కేంద్రీకృమైన చక్రవాతపు ఆవర్తనం గురువారం అదే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం - ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!